కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 76
  • రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్యమందిరంలో ఏం జరుగుతుంది?
  • మీరెందుకు హాజరవ్వాలి?
  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ఇది మన ఆరాధనా మందిరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఆరాధనా స్థలాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 76
ప్రజలు రాజ్యమందిరంలోకి వెళ్లడాన్ని గమనిస్తున్న ఒక యౌవనస్థుడు

యువత అడిగే ప్రశ్నలు

రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?

యెహోవాసాక్షులు, ఆరాధనా స్థలాలుగా పిలవబడే తమ రాజ్యమందిరాల్లో వారానికి రెండుసార్లు కూటాలు జరుపుకుంటారు. ఇంతకీ అక్కడేమి జరుగుతుంది? ఆ కూటాలకు హాజరవ్వడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

  • రాజ్యమందిరంలో ఏం జరుగుతుంది?

  • మీరెందుకు హాజరవ్వాలి?

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

రాజ్యమందిరంలో ఏం జరుగుతుంది?

రాజ్యమందిరంలో ముఖ్యంగా బైబిల్లోని విషయాల్ని మన జీవితాల్లో ఎలా పాటించాలో నేర్పిస్తారు. ఆ కూటాల ద్వారా మనం:

  • దేవుని గురించిన సత్యాన్ని నేర్చుకుంటాం.

  • నేడు జరుగుతున్న సంఘటనల వెనకున్న కారణాల్ని అర్థం చేసుకుంటాం.

  • ఒక మంచి వ్యక్తిగా ఎలా తయారవ్వవచ్చో నేర్చుకుంటాం.

  • మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాం.

మీకు తెలుసా? యెహోవాసాక్షులు, కూటాలు జరుపుకునే స్థలాల్ని రాజ్యమందిరాలు అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా దేవుని రాజ్యం గురించి చర్చిస్తారు.​—మత్తయి 6:9, 10; 24:14; లూకా 4:43.

మీరెందుకు హాజరవ్వాలి?

అక్కడ చెప్పే సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. యెహోవాసాక్షుల కూటాల్లో చర్చించే బైబిలు సూత్రాలు ‘జ్ఞానము సంపాదించుకోవడానికి’ సహాయం చేస్తాయి. (సామెతలు 4:5) అంటే ఆ సూత్రాల సహాయంతో మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో వచ్చే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు కూడా జవాబులు తెలుసుకోగలుగుతారు:

  • జీవితానికి అర్థం ఏంటి?

  • మన బాధలకు దేవుడే కారణమా?

  • చనిపోయాక ఏమి జరుగుతుంది?

వారాంతాల్లో జరిగే కూటాల్లో ప్రసంగాలు ఇస్తారు. వాటి అంశాల్లో కొన్నిటిని చూడండి:

  • బైబిలు చేత ఎందుకు నిర్దేశించబడాలి?

  • విపత్కర కాలాల్లో మీరు సహాయాన్ని ఎక్కడినుండి పొందవచ్చు?

  • దేవుని రాజ్యం ఇప్పుడు మనకోసం ఏమి చేస్తోంది?

19 సంవత్సరాల బ్రెండ ఇలా చెప్తోంది: “మా క్లాస్‌మేట్‌ ఒకసారి మా కూటాలకు వచ్చాడు. అతను మా కుటుంబంతోనే కూర్చున్నాడు. అతనికి మా పుస్తకాలు చూపించాం. ఆ తర్వాత అతను, మా కూటాలు ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా ప్రశ్నా-జవాబుల భాగంలో ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యానాలు అతనికి బాగా నచ్చాయని చెప్పాడు. అంతేకాకుండా మన దగ్గర ఉన్నలాంటి ప్రచురణలు వాళ్ల చర్చిలో లేవని అన్నాడు.”

మీకు తెలుసా? రాజ్యమందిరంలో ప్రవేశం ఉచితం, పైగా ఎటువంటి చందాలు సేకరించబడవు.

అక్కడున్న సహవాసం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. క్రైస్తవులు కూటాలకు హాజరవ్వడానికి గల ఒక కారణాన్ని బైబిలు ఇలా చెప్తుంది, “ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉందాం.” (హెబ్రీయులు 10:24, 25) స్వార్థంతో నిండివున్న ఈ లోకంలో తమ గురించి కన్నా దేవుని గురించి, ఇతరుల గురించి పట్టించుకునే ప్రజలతో సహవసించడం ఎంతో సంతోషాన్నిస్తుంది.

15 సంవత్సరాల ఏలీజా ఇలా చెప్తోంది: “రోజంతా పనిచేయడం వల్ల బాగా అలసటగా, నీరసంగా అనిపించేది. కానీ రాజ్యమందిరానికి రాగానే అక్కడున్న సహోదరులు నన్ను ఎంతో ప్రోత్సహించేవాళ్లు. దానివల్ల కూటం అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేది, మరో రోజును ఎదుర్కోవడానికి కావల్సిన బలం వచ్చేది.”

మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 60,000 కన్నా ఎక్కువ స్థలాల్లో 1,20,000 కన్నా ఎక్కువ యెహోవాసాక్షుల సంఘాలు ఉన్నాయి. కూటాలకు హాజరయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్న కారణంగా ప్రతీ సంవత్సరం సగటున 1500 కొత్త రాజ్యమందిరాల్ని కడుతున్నారు.a

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

జెస్సికా

22 సంవత్సరాల జెస్సికా ఇలా చెప్తోంది: “నేను హైస్కూల్‌ చదివేటప్పుడు నా క్లాస్‌మేట్‌ నాతోపాటు కొన్నిసార్లు కూటాలకి వచ్చింది. అక్కడ అన్ని వయసుల వాళ్లు కలిసి బైబిలు నేర్చుకోవడం తనకు ఎంతో నచ్చిందని చెప్పింది. ఈ మధ్యే మా బాస్‌ కూడా మా కూటానికి వచ్చాడు. అక్కడ మేమంతా బైబిల్ని ఎంత బాగా ఉపయోగిస్తున్నామో చూసి ఆశ్చర్యపోయాడు. కూటాల పట్ల అతనికి కలిగిన మెప్పుదలను చూసి నాక్కూడా మన కూటాల పట్ల మరింత గౌరవం పెరిగింది!”

తిమోతి

20 సంవత్సరాల తిమోతి ఇలా అంటున్నాడు: “రోజువారీ చింతలు, ఆందోళనల గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా ఉండడానికి కూటాలు సహాయం చేస్తాయి. మనం సంతృప్తిగా ఎలా జీవించవచ్చో, మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వవచ్చో వంటివాటితోపాటు మరెన్నో విషయాలు కూటాల్లో నేర్చుకుంటాం. రాజ్యమందిరం నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతీసారి నాకు చాలా ప్రోత్సాహంగా, కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది.”

యాకోబు

20 సంవత్సరాల యాకోబు ఇలా చెప్తున్నాడు: “నేను ఒకతన్ని కూటానికి ఆహ్వానించాను. అతను తర్వాత ఇలా అంటున్నాడు: ‘కేవలం మీ నమ్మకాలు తప్పని నిరూపించడానికే నేను కూటానికి వచ్చాను. కానీ నా నమ్మకాలే తప్పని అర్థమైంది!’ యెహోవాసాక్షులు పలకరించే విధానం కూడా అతనికి ఎంతో నచ్చింది. అతను ఇలా చెప్తున్నాడు: ‘నేను మిమ్మల్ని కలిసింది ఇప్పుడే. కానీ మీరు, నేను ఎన్నో సంవత్సరాల నుండి తెలిసిన వ్యక్తిలా నాతో మాట్లాడారు!’ ”

మాడిసన్‌

15 సంవత్సరాల మాడిసన్‌ ఇలా చెప్తోంది: “కొన్నిసార్లు నేను, ‘కూటం అయిపోయిన వెంటనే వెళ్లిపోవాలి’ అనుకునేదాన్ని. కానీ కూటం జరుగుతున్నంతసేపూ ఆ విషయం గుర్తుండేదికాదు. కూటం అయిపోయాక, నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు అసలు నేనెందుకు ఇంటికి వెంటనే వెళ్లిపోవాలనుకున్నానో ఆ కారణాన్ని మర్చిపోయేదాన్ని. నిజానికి కూటాలకు వెళ్లడం వల్లే నాకు మంచి స్నేహితులు దొరికారు.”

a కూటాలు ఎక్కడ జరుగుతాయో తెలుసుకోవడానికి, “యెహోవాసాక్షుల సంఘ కూటాలు” అనే వెబ్‌ పేజీకి వెళ్లి అక్కడ “మీకు దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని కనుక్కోండి” అనే దానిమీద క్లిక్‌ చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి