కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 75
  • నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఏమి తెలుసుకోవాలి?
  • మీరేమి చేయాలి?
  • క్షమించడం అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఈ చిన్నవాళ్లను’ బాధపెట్టకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • ‘ఒకని నొకడు క్షమించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 75
ఒక అమ్మాయి వేరే అమ్మాయిని బాధపెట్టేలా మాట్లాడుతుంది

యువత అడిగే ప్రశ్నలు

నా ఫ్రెండ్‌ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?

  • మీరు ఏమి తెలుసుకోవాలి?

  • మీరేమి చేయాలి?

  • మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

మీరు ఏమి తెలుసుకోవాలి?

  • మానవ సంబంధాల్లో సమస్యలు రావడం సహజం. మీ మంచి ఫ్రెండ్‌ ఆఖరికి మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అయినాసరే, అతను అపరిపూర్ణుడు కాబట్టి తన మాటల ద్వారా, చేతల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. మీరు కూడా అపరిపూర్ణులే. కాబట్టి నిజం చెప్పాలంటే, మీవల్ల కూడా ఇతరులు బాధపడిన సందర్భాలు ఉండేవుంటాయి.​—యాకోబు 3:2.

  • ఇంటర్నెట్‌ కారణంగా మీకు బాధ కలగవచ్చు. ఉదాహరణకు, డేవిడ్‌ అనే యౌవనస్థుడు ఇలా చెప్తున్నాడు: “మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్‌ అందరూ ఒక పార్టీలో దిగిన ఫోటోల్ని చూశారు. మిమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్లు మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటూ, బాధపడడం మొదలుపెట్టారు.”

  • మీ సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్చుకోండి.

మీరేమి చేయాలి?

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘త్వరగా కోపం తెచ్చుకోకు, ఎందుకంటే అది తెలివితక్కువవాళ్లకు గుర్తు.’​—ప్రసంగి 7:9, NW , అధస్సూచి.

24 ఏళ్ల యలిసా ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు, మీరు ఏ విషయం గురించైతే బాధపడుతున్నారో అదేమంత పెద్ద విషయం కాదని తర్వాత తెలుసుకుంటారు.”

ఆలోచించండి: మీరు అతిగా ఆలోచిస్తున్నారా? ఇతరుల అపరిపూర్ణతల్ని మరింతగా సహించడం నేర్చుకోగలరా?​—ప్రసంగి 7:21, 22.

క్షమించడం వల్ల వచ్చే లాభాల గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “తప్పులు క్షమించుట . . . ఘనతనిచ్చును.”​—సామెతలు 19:11.

23 ఏళ్ల మాలరీ ఇలా చెప్తొంది: “ఇతరులు మీ విషయంలో తప్పు చేసినప్పటికీ వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించడం మంచిది. దానర్థం, వాళ్ల తప్పును పదేపదే గుర్తుచేసి, అలా గుర్తుచేసిన ప్రతీసారి వాళ్లు మిమ్మల్ని క్షమాపణ అడిగేలా చేయడం కాదు. మీరు ఒక్కసారి క్షమించాక, మళ్లీ దాని గురించి ఎత్తకండి.”

ఆలోచించండి: పరిస్థితి మరీ అంత గంభీరమైనదా? శాంతిగా ఉండడం కోసం మీరు ఎదుటి వ్యక్తిని క్షమించగలరా?​—కొలొస్సయులు 3:13.

చల్లని గాలిని వెచ్చని గదిలోకి పంపించడం

ఫ్రెండ్‌షిప్‌లో ప్రతీ సమస్యను పట్టించుకోవడం, చలికాలంలో మాటిమాటికి తలుపు తెరిచి వెచ్చగా ఉన్న గదిలోకి చల్లని గాలిని పంపించినట్లు ఉంటుంది

ఇతరుల గురించి కూడా ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”​—ఫిలిప్పీయులు 2:4.

20 ఏళ్ల నీకోల్‌ ఇలా చెప్తుంది: “ఫ్రెండ్‌షిప్‌లో ప్రేమ, గౌరవం ఉంటే సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోవడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అదేంటంటే మీరు ఇప్పటికే ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చించి ఈ బంధాన్ని ఏర్పర్చుకున్నారు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలని కోరుకోరు.”

ఆలోచించండి: ఇతరుల ఆలోచనలో ఉన్న కాస్త మంచినైనా మీరు చూడగలరా?​—ఫిలిప్పీయులు 2:3.

ఒక్కమాటలో: అపార్థాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కూడా ఒక నైపుణ్యమే. ఆ నైపుణ్యం మీకుంటే, మీరు పెద్దవాళ్లయ్యాకా అది బాగా సహాయపడతుంది. మరీ ఇప్పుడే ఆ నైపుణ్యాన్ని ఎందుకు నేర్చుకోకూడదు?

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

కీయాన

20 ఏళ్ల కీయాన ఇలా అంటోంది: “ప్రతీ సమస్యను చర్చించి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా మనసులోనే ఆ సమస్యను పరిష్కరించుకోగలను అనుకుంటే, అలా చేస్తాను. ప్రతీ చిన్న తప్పును ఎదుటివ్యక్తి దృష్టికి తీసుకెళ్లడం కన్నా దాన్ని మనసులోనే పరిష్కరించుకోగలిగితే, మనసు ప్రశాంతంగా ఉంటుంది.”

ట్రే

20 ఏళ్ల ట్రే ఇలా చెప్తున్నాడు: “ ‘నా ఫ్రెండ్‌ని పొగోట్టుకోనేంత పెద్ద సమస్యా ఇది?’ అని ప్రతీ సందర్భంలో నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అప్పుడు దాదాపు ప్రతీసారి ‘కాదు’ అనే జవాబు వస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి