కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 60
  • మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 60

మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

మనం మరణాన్ని ఓ శత్రువుగా చూస్తూ దానికి భయపడతాం. అందుకే మన జీవాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. (1 కొరింథీయులు 15:26) అయితే, అబద్ధ సిద్ధాంతాలు, మూఢ నమ్మకాల వల్ల ప్రజలు మరణం గురించి అనవసరంగా భయపడుతూ ‘జీవితకాలమంతా దాస్యమునకు లోబడతారు.’ (హెబ్రీయులు 2:14, 15) మరణం గురించి అతిగా భయపడితే మీరు మీ జీవితాన్ని ఆనందించలేరు. కానీ సత్యం తెలుసుకోవడం వల్ల మీరు ఆ భయాన్ని పోగొట్టుకుంటారు.—యోహాను 8:32.

మరణం గురించిన నిజాలు

  • చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. (కీర్తన 146:4) చనిపోయినవాళ్లు బాధించబడతారని లేదా హింసించబడతారని మీరు భయపడనవసరం లేదు. ఎందుకంటే బైబిలు, మరణాన్ని నిద్రతో పోలుస్తుంది.—కీర్తన 13:3; యోహాను 11:11-14.

  • చనిపోయినవాళ్లు మనకు హాని చేయలేరు. చనిపోయిన భయంకరమైన శత్రువులు సైతం మనల్ని ఏమీ చేయలేరు. (సామెతలు 21:16) వాళ్లు “పగపెట్టుకొనరు, అసూయపడరు” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 9:6.

  • మన జీవితానికి మరణమే శాశ్వత ముగింపు కాదు. పునరుత్థానం ద్వారా దేవుడు చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించబోతున్నాడు.—యోహాను 5:28,29; అపొస్తలుల కార్యములు 24:15.

  • ‘మరణం ఇక ఉండని’ కాలం వస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. (ప్రకటన 21:4) ఆ కాలం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” వాళ్లు చనిపోతామనే భయమే లేకుండా నిరంతరం జీవిస్తారు.—కీర్తన 37:29.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి