కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 9
  • దేవునికి ఒక పేరు ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి ఒక పేరు ఉందా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
  • ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • A4 హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ఏకైక సత్యదేవుడ్ని గుర్తించడం
    తేజరిల్లు!—1999
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 9
హీబ్రూ భాషలో దేవుని పేరు

దేవునికి ఒక పేరు ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు

మనందరికీ ఒక పేరుంది. మరి దేవునికి కూడా ఓ పేరు ఉందా? ఇద్దరి మధ్య స్నేహం పెరగడానికి, పేరు తెలుసుకోవడం, పేరుతో పిలవడం ఎంతో అవసరం. మరి దేవునితో స్నేహం చేయాలంటే ఆయన పేరు తెలుసుకోవాలి కదా!

“యెహోవాను నేనే; ఇదే నా నామము” అని దేవుడు చెప్పాడు. (యెషయా 42:8) “సర్వశక్తిగల దేవుడు,” ‘సర్వోన్నతుడు,’ “సృష్టికర్త” అని దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ దేవుడు తన పేరును ఉపయోగించే అవకాశమిచ్చి మనల్ని గౌరవిస్తున్నాడు.—ఆదికాండము 17:1; అపొస్తలుల కార్యములు 4:24, 25; 1 పేతురు 4:19.

చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు నిర్గమకాండము 6:3 వ వచనంలో ఉంది. అక్కడ ఇలా ఉంది “నేను సర్వశక్తిగల దేవుడు అను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.”

శతాబ్దాలుగా దేవుని పేరును, జెహోవా [యెహోవా] అని ఇంగ్లీషులో ఉపయోగిస్తున్నాం. చాలామంది విద్వాంసులు “యావే” అని ఉచ్చరించడానికి ఇష్టపడతారు కానీ జెహోవా అనే పేరే బాగా వాడుకలో ఉంది. బైబిలు మొదటి భాగం ఇంగ్లీషులో కాదు గానీ హీబ్రూ భాషలో రాశారు, ఆ భాషను కుడి వైపు నుండి ఎడమ వైపుకు చదువుతారు. ఆ భాషలో దేవుని పేరు నాలుగు హల్లులతో יהוה అని రాస్తారు. హీబ్రూ భాషలో ఉన్న ఆ నాలుగు హల్లులే టెట్రాగ్రామటన్‌ అని అంటారు. వాటిని తెలుగులో రాస్తే యహ్‌వహ్‌ అని అంటారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి