Comstock Images/Stockbyte via Getty Images
అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
తమకు ఎవరిమీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్లే ప్రభుత్వాన్ని నడిపించాలని ప్రజలు కోరుకుంటారు. అవినీతి చేస్తున్న నాయకుల్ని చూసీచూసీ ప్రజలు విసికి వేసారిపోయారు. 2023 లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వే, ప్రజలకు ప్రభుత్వాల్ని నడిపించే పాలకుల మీద చాలా తక్కువ నమ్మకం ఉంది అని తేల్చింది.a
బైబిలు ఒక ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. దాని నాయకుడు పూర్తిగా నమ్మదగినవాడు, నిజాయితీపరుడు, కొంచెం కూడా అవినీతి లేనివాడు అని చెప్తుంది. ఆ ప్రభుత్వమే దేవుని రాజ్యం, దాని నాయకుడు మరెవరో కాదు, యేసుక్రీస్తే.—యెషయా 9:7.
యేసు ప్రజల పట్ల నిజమైన శ్రద్ధ ఉందని తన పనుల ద్వారా చూపించాడు. (మత్తయి 9:35, 36) ఆయన దేవుని రాజ్యానికి రాజుగా, తన నాయకత్వాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకు న్యాయాన్ని, శాంతిని ఇస్తాడు.—కీర్తన 72:12-14.
a 2023 ఎడెల్మ్యాన్ ట్రస్ట్ బ్యారోమీటర్ గ్లోబల్ రిపోర్ట్.