కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 93
  • ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
  • అదనపు అంశాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పర్యావరణ సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
  • అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
  • అసమానత్వం—దేవుడు దాన్ని ఉద్దేశించాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
    అదనపు అంశాలు
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 93
ఒక పెద్ద నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది, ఆ నగరంలోని భవనాలు పాడైపోతున్నాయి.

Kim Steele/The Image Bank via Getty Images

ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

ప్రపంచంలో చాలామంది ఎంత కష్టపడినా, తమ కనీస అవసరాలకు సరిపడా డబ్బును సంపాదించలేకపోతున్నారు. ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

  • ఈమధ్యే వచ్చిన ఒక గ్లోబల్‌ రిపోర్ట్‌,a “ప్రజల నెలసరి జీతం బాగా తగ్గిపోయింది” అని చెప్తోంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ధనవంతులు-పేదవాళ్ల మధ్య తేడా ఇంకా పెరిగిపోతుంది, చాలీచాలని డబ్బులతో తమ కుటుంబాన్ని నెట్టుకురావల్సిన పరిస్థితి చాలామందికి వస్తుందని కూడా ఆ రిపోర్ట్‌ హెచ్చరించింది.

ప్రభుత్వాలు ఈ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించగలుగుతాయా? కనీసం తగ్గించగలుగుతాయా?

ధనవంతులు-పేదవాళ్లు అనే తేడాల్ని తీసేయడంతో పాటు, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తోంది. భూమ్మీదున్న వాళ్లందరి బాగోగుల్ని చూసుకోవడానికి “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని (లేదా, ప్రభుత్వాన్ని) స్థాపిస్తాడు” అని బైబిలు చెప్తోంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వం ప్రతీ ఒక్కర్ని పట్టించుకుంటుంది, ఎవ్వర్నీ నిర్లక్ష్యం చేయదు. (కీర్తన 9:18) అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ప్రతీ ఒక్కరు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పూర్తిగా ఆనందిస్తారు.—యెషయా 65:21, 22.

దేవుని రాజ్యం అంటే ఏంటి?

“దేవుని రాజ్యం అంటే ఏంటి?” అనే విషయాన్ని వివరించే “కావలికోట” పత్రిక

యెహోవాసాక్షులు 2023 సెప్టెంబర్‌ నెలలో ఈ ప్రాముఖ్యమైన అంశం గురించి బైబిలు ఏం చెప్తుందో ప్రజలకు చెప్పడానికి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని గురించి తెలిపే కావలికోట పత్రికను చదవమని మిమ్మల్ని కోరుతున్నాం. దాని అంశం “దేవుని రాజ్యం అంటే ఏంటి?” అందులో ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోండి:

  • దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

  • దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

a ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ వేజ్‌ రిపోర్ట్‌ 2022-23

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి