పైన ఎడమవైపు నుండి: Marek M. Berezowski/Anadolu Agency via Getty Images; కింద ఎడమవైపు నుండి: Halfpoint Images/Moment via Getty Images; center: Zhai Yujia/China News Service/VCG via Getty Images; పైన కుడివైపు నుండి: Ismail Sen/Anadolu Agency via Getty Images; కింద కుడివైపు నుండి: E+/taseffski/via Getty Images
అప్రమత్తంగా ఉండండి!
చెమటలు పట్టించిన 2023వ సంవత్సరం—బైబిలు ఏం చెప్తుంది?
2023వ సంవత్సరంలో చాలా జరిగాయి! అవన్నీ బైబిలు చెప్తున్నట్టు మనం “చివరి రోజుల్లో” ఉన్నామని అనడానికి కాదనలేని రుజువులు. (2 తిమోతి 3:1) మన రోజుల్లో జరిగేవి బైబిలు ముందే కరెక్ట్‌గా చెప్పింది. అవేంటో చూడండి.
బైబిలు ఏం చెప్పింది, ప్రపంచంలో ఏం జరిగింది!
‘యుద్ధాలు, యుద్ధ వార్తలు.’—మత్తయి 24:6.
“చాలా దేశాలు రక్తపాతంతో నిండిపోయాయి.”a
“పౌరులను కాపాడేది ఎవరు?” అలాగే “ప్రపంచవ్యాప్తంగా మిలటరీ ఖర్చు 2 ట్రిలియన్ డాలర్లు దాటేసింది” ఆర్టికల్స్ చూడండి.
“ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు.”—మార్కు 13:8.
“2023 మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 7 కన్నా ఎక్కువ తీవ్రతతో 13 భూకంపాలు వచ్చాయి. ఇది చరిత్రనే తిరగరాసింది.”b
“టర్కీ, సిరియాల్ని అతలాకుతలం చేసిన భూకంపాలు” ఆర్టికల్ చూడండి.
“భయంకరమైన దృశ్యాలు.”—లూకా 21:11.
“భూమి వేడెక్కే శకం ముగిసింది; ఇప్పుడు భూమి కాలిపోయే శకం నడుస్తుంది.”—ఆంటోనియో గుటేరస్, UN సెక్రెటరీ జనరల్.c
“2023 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు” ఆర్టికల్ చూడండి.
“ఆహారకొరతలు.”—మత్తయి 24:7.
“2023వ సంవత్సరంలో, పిల్లల ఆకలి తీర్చలేక అల్లాడిపోయిన అమ్మానాన్నలు.”d
“యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు” ఆర్టికల్ చూడండి.
“ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు.”—2 తిమోతి 3:1.
“ఈ నేల మీద బ్రతికే ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు.”e
“టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు” ఆర్టికల్ చూడండి.
2024వ సంవత్సరం ఏం దాచివుంచింది?
ఎవ్వరికీ తెలీదు! కానీ భూమ్మీద జరుగుతున్నవి చూస్తుంటే, దేవుని రాజ్యం లేదా పరలోక ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాల్ని తీసేసి, మన కన్నీళ్లను తుడవడానికి, కష్టాల్ని గట్టెక్కించడానికి ఇంకా ఎన్నో రోజులు లేవని అర్థమౌతుంది.—దానియేలు 2:44; ప్రకటన 21:4.
అప్పటివరకు మీకు కంగారుగా అనిపిస్తే దేవున్ని తలుచుకోండి. బైబిలు ఇలా చెప్తుంది:
“నాకు భయం వేసినప్పుడు, నేను నీ మీద నమ్మకం పెట్టుకుంటాను.”—కీర్తన 56:3.
దేవుని మీద నమ్మకం పెట్టుకున్నామని ఎలా చూపించవచ్చు? కష్టాలు కనుచూపుమేరలో కూడా కనిపించని భవిష్యత్తు గురించి బైబిలు ఏమని మాట ఇస్తుందో తెలుసుకోమని మిమ్మల్ని పిలుస్తున్నాం. ఉచితంగా పొందే బైబిలు స్టడీ కోర్సు ద్వారా బైబిలు మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చే అభయాన్ని తెలుసుకుంటారు.
a ఫారిన్ అఫైర్స్, “యుద్ధ మరకల్లో భూమి: ప్రపంచవ్యాప్తంగా అల్లర్లకు, గొడవలకు కారణం ఏంటి?” (ఇంగ్లీష్) ఎమ్మా బీల్స్ అలాగే పీటర్ సాలిస్బరీ, అక్టోబరు 30, 2023.
b ఎర్త్‌క్వేక్ న్యూస్, “2023 సంవత్సరం: రికార్డులను బద్దలు కొట్టిన పెద్దపెద్ద భూకంపాల సంఖ్య,” (ఇంగ్లీష్) మే, 2023.
c యునైటెడ్ నేషన్స్, “వాతావరణం గురించి జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సెక్రెటరీ-జనరల్ తొలి పలుకులు,” (ఇంగ్లీష్) జూలై 27, 2023.
d ప్రపంచ ఆహార కార్యక్రమం, “భూవ్యాప్తంగా ఉన్న ఆహారకొరతలు.” (ఇంగ్లీష్)
e ప్రపంచ ఆరోగ్య సంస్థ, “2023 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం,” (ఇంగ్లీష్) అక్టోబరు 10, 2023.