కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 ఫిబ్రవరి పేజీ 30-పేజీ 31 పేరా 7
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • త్వరలో మతాలకు ఏం జరుగుతుంది?—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • ‘అంత్యదినాల’ చివర్లో ఎక్కువ సేవచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • ఈ లోకం ఎలా అంతమౌతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 ఫిబ్రవరి పేజీ 30-పేజీ 31 పేరా 7
ప్రపంచ నాయకులు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ముందు నిలబడి “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని పెద్ద జనసమూహానికి ప్రకటన చేస్తున్నారు.

పాఠకుల ప్రశ్న

“అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు” అనే ప్రకటనను ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తాయి?

ఈమధ్య కావలికోటలో వచ్చిన “పాఠకుల ప్రశ్న”లో,a యెహోవా దేవుడు అతిత్వరలో “పది కొమ్ముల” (ప్రభుత్వాలన్నిటి) హృదయాల్లో తన ఆలోచనను పెడతాడని చూశాం. ఆ ప్రభుత్వాల నాయకులు తమ అధికారాన్ని, శక్తిని ‘ఎర్రని క్రూరమృగానికి’ అంటే ఐక్య రాజ్య సమితికి ఇవ్వాలన్నదే ఆ ఆలోచన. ఈ ఎర్రని క్రూరమృగాన్ని “మొదటి క్రూరమృగపు ప్రతిమ” అని కూడా బైబిలు పిలుస్తుంది. (ప్రక. 13:14, 15; 17:3, 16, 17) తర్వాత “ఆ పది కొమ్ములు,” అలాగే కొత్తగా అధికారం పొందిన ఈ క్రూరమృగం కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబద్ధ మతాన్ని నాశనం చేస్తాయి. మరి ప్రభుత్వాలు “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!”b అనే ప్రకటనను ఎప్పుడు చేస్తాయి? అబద్ధ మతం నాశనమయ్యే ముందా లేక తర్వాతా?—1 థెస్స. 5:3.

ఒక్కముక్కలో చెప్పాలంటే, ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో మనకు ఖచ్చితంగా తెలీదు. ఒకవేళ మనకు అన్ని వివరాలూ తెలిసుంటే మనం అప్రమత్తంగా, మెలకువగా ఉండనక్కర్లేదు కదా. కానీ, యేసు “అప్రమత్తంగా ఉండండి” అని తన అనుచరులకు పదేపదే చెప్పాడు. (మత్త. 24:42; 25:13; 26:41) అయితే, థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు పవిత్రశక్తి సహాయంతో చెప్పిన ఒక ప్రవచనం గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం.

పౌలు ఇలా రాశాడు: “ప్రజలు [లేదా ప్రభుత్వాలు] ఎప్పుడైతే, ‘అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!’ అని అంటూ ఉంటారో అప్పుడు . . . హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది.” (1 థెస్స. 5:2, 3) ఈ మాటల్ని మన ప్రచురణలు చాలావరకు ఇలా వివరించాయి: “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన మహాశ్రమ మొదలవ్వడానికి కాస్త ముందు, అంటే మహాబబులోను లేదా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం నాశనమవ్వడానికి కాస్త ముందు వస్తుంది. ఈ ప్రకటనే మహాశ్రమ మొదలవ్వబోతుంది అనడానికి చిట్టచివరి గుర్తు.

కానీ కొంచెం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, పౌలు మాటల్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చని తెలిసింది. అదేంటంటే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన, బహుశా అబద్ధమత సామ్రాజ్యం నాశనమైన తర్వాత రావచ్చు. అలా కూడా జరగవచ్చని ఎందుకు చెప్పవచ్చు? కిందున్న ప్రశ్నల గురించి ఆలోచించండి.

భూమ్మీద జరిగిన యుద్ధాల్లో అబద్ధమత హస్తం ఎంతవరకు ఉంది? బైబిలు ఇలా వివరిస్తుంది: “భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి రక్తం ఈ నగరంలో [“గొప్ప వేశ్య” అయిన మహాబబులోనులో] కనిపించింది.” (ప్రక. 17:1, 5; 18:24) ఈ గొప్ప వేశ్య యుద్ధాల్ని, తీవ్రవాదాన్ని ఎంతగా ప్రోత్సహించిందంటే, దానివల్ల చరిత్ర పుటలన్నీ రక్తంతో ఎరుపెక్కాయి. ఆమె యుద్ధాన్ని, రక్తపాతాన్నే పెంచి పోషించింది గానీ శాంతిభద్రతల్ని కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది: మహాబబులోను నాశనమైన తర్వాతే “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని ప్రభుత్వాలు ప్రకటన చేస్తాయా? అదే జరగవచ్చు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా చెప్పలేం.

“అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పౌలు ఇలా చెప్తున్నాడు: “అప్పుడు హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది.” (1 థెస్స. 5:3) ఇంగ్లీషు బైబిల్లో ఈ వచనం దగ్గరున్న స్టడీ నోట్‌ ఇలా చెప్తుంది: “పౌలు మాటల్ని బట్టి, ‘అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు’ అనే ప్రకటన రావడానికి, అలాగే ఆ ప్రకటన చేసినవాళ్లు నాశనం అవ్వడానికి మధ్య చాలా తక్కువ టైం ఉంటుంది లేదా అసలు టైమే ఉండదు. ఆ నాశనం హఠాత్తుగా వస్తుంది, వాళ్లు అస్సలు తప్పించుకోలేరు.” అవును, అబద్ధమతం నాశనమైన తర్వాత ప్రభుత్వాలు “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన చేస్తే, వాళ్ల మీదికి వచ్చే నాశనం హఠాత్తుగా వచ్చినట్టు అవుతుంది.

ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు యెహోవా ప్రజలకు ఎలా అనిపిస్తుంది? పౌలు ఇలా చెప్పాడు: “సహోదరులారా, ఆ రోజు అకస్మాత్తుగా మీ మీదికి రావడానికి మీరేమీ దొంగల్లా చీకట్లో లేరు.” (1 థెస్స. 5:4) అబద్ధమతం నాశనమైన తర్వాత “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన రాగానే, ఆ ప్రభుత్వాలకు నాశనం దగ్గరపడిందని యెహోవా ప్రజలకు అర్థమైపోతుంది. కానీ ఆ ప్రభుత్వాలకు మాత్రం, ఆ నాశనం ఒక దొంగలా చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది.

ఇంతకీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది? అతిత్వరలో “ఆ పది కొమ్ములు,” అలాగే అధికారం పొందిన ఆ క్రూరమృగం కలిసి అబద్ధమతాన్ని నాశనం చేస్తాయి. ఆ నాశనంతో మహాశ్రమ మొదలౌతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఏదోక సమయంలో “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని ప్రభుత్వాలు ప్రకటన చేస్తాయి. ఇంతకీ అది ఎప్పుడు? ఈ ఆర్టికల్‌లో చర్చించినట్టు ఈ రెండిటిలో ఒకటి అయ్యుండవచ్చు. ఒకటి: అబద్ధ మతం నాశనమయ్యే ముందు ఆ ప్రకటన రావచ్చు. రెండు: ప్రభుత్వాలు అబద్ధ మతాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఆ ప్రకటన రావచ్చు. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే, చాలావరకు బైబిలు ప్రవచనాలు అవి నెరవేరుతున్నప్పుడో, నెరవేరిన తర్వాతో మనకు పూర్తిగా అర్థమౌతాయి.—యోహాను 12:16 పోల్చండి.

“అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యం కాదుగానీ, మనం యెహోవాకు నమ్మకంగా ఉంటామా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి ఏ సంఘటన ఎప్పుడు జరిగినా మనం పూర్తిగా సిద్ధంగా ఉండాలంటే మెలకువగా ఉండాలి, మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవాలి.—1 థెస్స. 5:6.

a 2025 నవంబరు కావలికోటలోని “పాఠకుల ప్రశ్న” చూడండి.

b ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన మాటల్ని బట్టి, అది ఒక ప్రకటన కావచ్చు లేదా వరుసగా వచ్చే ప్రకటనలు కావచ్చు అని అర్థమౌతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి