అధ్యయనం కోసం చిట్కా
మానకుండా రోజూ బైబిలు చదవండి
చేతినిండా పనులు ఉండేసరికి, మీరు వేసుకున్న పట్టిక ప్రకారం రోజూ బైబిలు చదవడానికి తంటాలు పడుతున్నారా? (యెహో. 1:8) అలాగైతే, వీటిలో ఒక చిట్కా పాటించి చూడండి:
అలారమ్ పెట్టుకోండి. మీరు బైబిలు చదవాలని గుర్తొచ్చేలా ఫోన్లో అలారమ్ పెట్టుకోండి.
బైబిల్ని మీకు కనిపించేలా పెట్టుకోండి. మీరు ఫోన్లో కాకుండా నేరుగా బైబిల్లో నుండే చదువుతుంటే, అది రోజూ కనిపించే చోట పెట్టుకోండి.—ద్వితీ. 11:18.
బైబిలు ఆడియో వినండి. ఇంటిపనులు చేసుకుంటూ బైబిలు ఆడియో వినండి. ఒక చేత్తో నైట్ డ్యూటీలు, ఇంకో చేత్తో పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్న తార అనే పయినీరు ఇలా అంటుంది: “నేను ఇంటిపనులు చేసుకుంటూ బైబిలు ఆడియో వినడం వల్ల, బైబిలు చదవడంలో గ్యాప్ రాదు.”
పట్టు వదలొద్దు. అనుకోని పరిస్థితుల వల్ల మీ ప్లాన్ తారుమారైనా, పడుకునే ముందు కనీసం కొన్ని వచనాలైనా చదవండి. కొంచెం చదివినా లాభమే.—1 పేతు. 2:2.