మన క్రైస్తవ జీవితం
మీరు బైబిలు ఆడియోను చక్కగా ఉపయోగించుకుంటున్నారా?
బైబిలు ఆడియో అంటే ఏంటి? కొత్త లోక అనువాదం బైబిల్ని, వినడానికి వీలుగా రికార్డు చేసిందే ఈ బైబిలు ఆడియో. అది, వీలైనన్ని ఎక్కువ భాషల్లో క్రమక్రమంగా రిలీజ్ అవుతూ వస్తుంది. వీలైన సందర్భాల్లో, ఒక్కో బైబిలు పాత్రకి ఒక్కో వ్యక్తి చదివేలా ఏర్పాటు చేస్తారు. బైబిలు ఆడియోలో పదాల్ని సరైన ఉచ్చారణతో, సరైన స్వరంతో, తప్పులు లేకుండా చదివారు.
బైబిలు ఆడియోను వింటున్న కొంతమంది ఎలా ప్రయోజనం పొందుతున్నారు? బైబిలు ఆడియోను వింటున్న చాలామంది, బైబిల్లో ఉన్న పాత్రల్ని నిజమైన వ్యక్తులుగా చూడగలుగుతున్నారు. అక్కడ జరుగుతున్న సంఘటనల్ని వాళ్ల కళ్లముందే జరుగుతున్నట్టు ఊహించుకోగలుగుతున్నారు. బైబిల్లో ఉన్న విషయాల్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. (సామె 4:5) బైబిలు ఆడియో వినడంవల్ల ఆందోళనతో నిండిన హృదయాలకు ఊరట దొరుకుతున్నట్టు చాలామంది భావిస్తున్నారు.—కీర్త 94:19.
దేవుని వాక్యాన్ని బయటికి చదువుతున్నప్పుడు వినడం వల్ల అది మనల్ని కదిలిస్తుంది. (2ది 34:19-21) మీకు అర్థమయ్యే భాషలో పూర్తి బైబిలు ఆడియో ఉన్నా లేదా కొన్ని భాగాలు ఉన్నా మీరు దాన్ని ప్రతీరోజు వినే అలవాటు చేసుకోగలరా?
బైబిలు ఆడియోను ఎలా తయారుచేస్తారు? చిన్నభాగం వీడియో చూసి, ఈ కింది ప్రశ్నకు జవాబు చెప్పండి:
బైబిలు ఆడియోను తయారుచేసే దాంట్లో మీకేది బాగా నచ్చింది?