కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 అక్టోబరు పేజీలు 30-31
  • పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏంటి?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • పరిపాలక సభలో కొత్త సభ్యుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • పరిపాలక సభలో క్రొత్త సభ్యులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 అక్టోబరు పేజీలు 30-31

పరిపాలక సభలో ఇద్దరు కొత్త సభ్యులు

2024, అక్టోబరు 5న, వార్షిక కూటంలో ఒక ప్రత్యేకమైన ప్రకటన చేశారు. అదేంటంటే: బ్రదర్‌ జోడి జేడ్లి, అలాగే బ్రదర్‌ జేకబ్‌ రంఫ్‌ యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యులుగా నియమితులయ్యారు. ఆ ఇద్దరు బ్రదర్స్‌ ఎన్నో సంవత్సరాల నుండి నమ్మకంగా యెహోవాను సేవిస్తున్నారు.

జోడి జేడ్లి, ఆయన భార్య డమారిస్‌

బ్రదర్‌ జేడ్లి అమెరికాలోని మిస్సోరిలో పుట్టాడు, సత్యంలో పెరిగాడు. వాళ్లు ఉన్న చోట ఒక్క యెహోవాసాక్షి కూడా లేరు. కాబట్టి, అక్కడ ప్రకటించడానికి వచ్చే వేర్వేరు నేపథ్యాల బ్రదర్స్‌ని ఆయన కలిశాడు. వాళ్ల ప్రేమ, ఐక్యత ఆయన మీద చెరగని ముద్రవేశాయి. ఆయన టీనేజీలోకి వచ్చిన వెంటనే 1983, అక్టోబరు 15న బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనకు ప్రీచింగ్‌ అంటే మహా ఇష్టం. అందుకే స్కూల్‌ అయిపోయాక 1989, సెప్టెంబరులో క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాడు.

చిన్నప్పుడు బ్రదర్‌ జేడ్లి వాళ్ల అమ్మానాన్నలు ఆయన్ని, ఆయన చెల్లిని బెతెల్‌ చూడడానికి తీసుకెళ్లేవాళ్లు. అలా తీసుకెళ్లడం వల్ల వాళ్లిద్దరు బెతెల్‌ సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు, దాన్ని చేరుకున్నారు కూడా. బ్రదర్‌ జేడ్లి 1990, సెప్టెంబరులో వాల్‌కిల్‌ బెతెల్‌లో సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయన మొదట క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్లో, ఆ తర్వాత మెడికల్‌ సర్వీసెస్‌లో పనిచేశాడు.

ఆ టైంలో, దగ్గర్లో ఉన్న స్పానిష్‌ భాషా సంఘాలు అప్పుడప్పుడే ఎదుగుతున్నాయి. కాబట్టి, బ్రదర్స్‌ అవసరం అక్కడ ఎంతో ఉంది. అందుకే, బ్రదర్‌ జేడ్లి వాటిలో ఒకదానికి వెళ్లి స్పానిష్‌ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి, అదే సర్క్యూట్‌లో పయినీరు సేవ చేస్తున్న డమారిస్‌ అనే సిస్టర్‌ని కలిశాడు. తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు, ఆమె కూడా బెతెల్‌కి వచ్చింది.

2005లో వాళ్లు బెతెల్‌ని వదిలేసి, వాళ్ల అమ్మానాన్నల్ని చూసుకోవడానికి వెళ్లారు. ఆ టైంలో వాళ్లు క్రమ పయినీర్లుగా సేవ చేశారు. బ్రదర్‌ జేడ్లి అయితే పయినీరు సేవా పాఠశాల ఉపదేశకునిగా సేవచేశాడు. అలాగే స్థానిక ఆసుపత్రి అనుసంధాన కమిటీలో, అలాగే రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలో కూడా సేవచేశాడు.

2013లో బ్రదర్‌, సిస్టర్‌ జేడ్లిని వార్విక్‌ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేయడానికి బెతెల్‌కి మళ్లీ పిలిచారు. ఆ తర్వాత వాళ్లు ప్యాటర్‌సన్‌లో, వాల్‌కిల్‌లో కూడా పనిచేశారు. బ్రదర్‌ జేడ్లి లోకల్‌ డిజైన్‌/కన్‌స్ట్రక్షన్‌లో, అలాగే హాస్పిటల్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌లో సేవచేశాడు. 2023, మార్చిలో ఆయన్ని సర్వీస్‌ కమిటీ సహాయకుడిగా నియమించారు. తనకొచ్చిన నియామకాలన్నీ గుర్తుచేసుకుంటూ ఆయన ఇలా అంటున్నాడు: “ఏవైనా కొత్త నియామకాలు వచ్చినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ అప్పుడే మనం గుర్తుంచుకోవాలి, యెహోవా మీద ఆధారపడాలని. ఎందుకంటే, ఆయనే ఏదైనా అయ్యేలా చేస్తాడు.”

జేకబ్‌ రంఫ్‌, ఆయన భార్య ఇంగా

బ్రదర్‌ రంఫ్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టాడు. చిన్నప్పుడు వాళ్ల అమ్మ నిష్క్రియురాలు అయిపోయింది, కానీ ఆయనలో బైబిలు సత్యాల్ని నాటడానికి ప్రయత్నం అయితే చేసింది. అంతేకాదు, ఆయన ప్రతీ సంవత్సరం వాళ్ల నాన్నమ్మని కలవడానికి వెళ్లేవాడు, ఆమె ఒక నమ్మకమైన యెహోవాసాక్షి. ఆమె వల్లే ఆయనకు సత్యం మీద ఆసక్తి పెరిగింది. అందుకే 13 ఏళ్ల వయసులో ఆయన బైబిలు స్టడీ కావాలని అడిగాడు. 1992, సెప్టెంబరు 27న, టీనేజీలో ఉన్నప్పుడే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. సంతోషకరమైన విషయమేంటంటే, వాళ్లమ్మ మళ్లీ ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి రావడం మొదలుపెట్టింది. అలాగే వాళ్ల తమ్ముడు, చెల్లి కూడా ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకున్నారు.

చిన్నప్పుడు బ్రదర్‌ రంఫ్‌, పయినీర్ల సంతోషం చూసి చాలా మురిసిపోయేవాడు. కాబట్టి స్కూల్‌ చదువు అయిపోగానే 1995, సెప్టెంబరులో ఆయన పయినీరు సేవ మొదలుపెట్టాడు. 2000లో, అవసరం ఎక్కువున్న చోట సేవచేయాలనే ఉద్దేశంతో ఆయన ఈక్వెడార్‌కి వెళ్లాడు. అక్కడ కెనడా నుండి వచ్చిన ఇంగా అనే పయినీరు సిస్టర్‌ని కలిశాడు, తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరు కలిసి ఈక్వెడార్‌లో ఒక పల్లెటూరిలో సేవచేశారు. అక్కడ కొంతమంది ప్రచారకులే ఉన్న ఒక చిన్న గుంపు ఉంది. ఇప్పుడు అది ఒక పెద్ద సంఘం.

ఆ తర్వాత బ్రదర్‌, సిస్టర్‌ రంఫ్‌ని ప్రత్యేక పయినీరు సేవకు, ఆ తర్వాత ప్రాంతీయ సేవకు పంపించారు. 2011లో వాళ్లకు, గిలియడ్‌ 132వ తరగతికి ఆహ్వానం వచ్చింది. ఆ పాఠశాల అయిపోయాక వాళ్లు చాలా చోట్ల బెతెల్‌ సేవ, మిషనరీ సేవ, ప్రాంతీయ సేవ లాంటి రకరకాల సేవలు చేశారు. బ్రదర్‌ రంఫ్‌కి, రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు ఉపదేశకునిగా పనిచేసే అవకాశం కూడా దొరికింది.

కోవిడ్‌-19 మహమ్మారి వల్ల బ్రదర్‌, సిస్టర్‌ రంఫ్‌ తిరిగి యునైటెడ్‌ స్టేట్స్‌కి వెళ్లిపోయారు. అక్కడ వాళ్లకు వాల్‌కిల్‌ బెతెల్‌కి ఆహ్వానం వచ్చింది. అక్కడ బ్రదర్‌ రంఫ్‌కి సర్వీస్‌ డిపార్ట్‌మెంట్లో ట్రైనింగ్‌ దొరికింది. తర్వాత వాళ్లను ఈక్వెడార్‌ బ్రాంచికి పంపించారు. అప్పుడు బ్రదర్‌ రంఫ్‌ బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవచేశాడు. 2023లో వాళ్లను వార్విక్‌కి పంపించారు. 2024, జనవరిలో బ్రదర్‌ రంఫ్‌ని సర్వీస్‌ కమిటీ సభ్యునిగా నియమించారు. ఆయన ఎక్కడెక్కడ పని చేశాడో తలుచుకుంటూ ఇలా అంటున్నాడు: “మన నియామకాన్ని ప్రత్యేకమైనదిగా చేసేదేంటో తెలుసా, మనం ఎక్కడ ఉండి చేస్తున్నామో ఆ చోటు కాదు, మనం ఎవరితో కలిసి చేస్తున్నామో ఆ ప్రజలే.”

కష్టపడి పనిచేసే ఇలాంటి బ్రదర్స్‌ అంటే మనకు చాలా ఇష్టం, మనం వాళ్లను “విలువైనవాళ్లుగా” చూస్తాం.—ఫిలి. 2:29.

ఇప్పుడు పరిపాలక సభలో 11 మంది అభిషిక్త సహోదరులు ఉన్నారు: జూ. కెన్నెత్‌ కుక్‌; గేజ్‌ ఫ్లీగల్‌; సామ్యూల్‌ హెర్డ్‌; జెఫ్రీ జాక్సన్‌; జోడి జేడ్లి; స్టీఫెన్‌ లెట్‌; గెరిట్‌ లోష్‌; జేకబ్‌ రంఫ్‌; మార్క్‌ సాండర్సన్‌; డేవిడ్‌ స్ప్లేన్‌; అలాగే జెఫ్రీ విండర్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి