కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp25 No. 1 పేజీలు 10-13
  • యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మనుషుల పరిపాలనను తుడిచిపెట్టేస్తాడు
  • దేవుడు పాపాన్ని కడిగిపారేస్తాడు
  • సాతాన్ని, అతని చెడ్డదూతల్ని దేవుడు నాశనం చేసేస్తాడు
  • యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
wp25 No. 1 పేజీలు 10-13
యుద్ధం వల్ల నగరమంతా నాశనమైపోయింది. ఒక సైనికుడు కూలిన శిథిలాల మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు.

యుద్ధాలకు తెరదించడం మనుషుల వల్ల కాదు

యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?

“భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా” చేయడం దేవుని వల్లే అవుతుంది గానీ, మనుషుల వల్ల కాదని బైబిలు చెప్తుంది.—కీర్తన 46:9.

దేవుడు మనుషుల పరిపాలనను తుడిచిపెట్టేస్తాడు

దేవుడు ఒక యుద్ధం చేసి మనుషుల పరిపాలనను తుడిచిపెట్టేస్తాడు. దాన్నే హార్‌మెగిద్దోన్‌ యుద్ధం అని బైబిలు పిలుస్తుంది.a (ప్రకటన 16:16) అప్పుడు, “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే యుద్ధం కోసం భూమంతటా ఉన్న రాజులు” పోగు చేయబడతారు. (ప్రకటన 16:14) హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ద్వారా దేవుడు అన్ని యుద్ధాలకు ముగింపు పలకబోతున్నాడు.

దేవుడు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నిటినీ తీసేసి తన ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది పరలోకం నుండి పరిపాలిస్తుంది, దానికి ఎప్పటికీ నాశనం ఉండదు. (దానియేలు 2:44) ఆ రాజ్యానికి రాజుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంచుకున్నాడు. (యెషయా 9:6, 7; మత్తయి 28:18) యేసు ప్రార్థించమని తన శిష్యులకు చెప్పింది కూడా ఆ రాజ్యంb గురించే. (మత్తయి 6:9, 10) అది వచ్చినప్పుడు, భూమ్మీది ప్రజలందరూ ఒకే ప్రభుత్వంలో, ఒకే రాజు కింద ఐక్యంగా ఉంటారు.

ఇప్పుడున్న పాలకులు తమ అధికారాన్ని వాళ్లకు నచ్చినట్టు ఉపయోగిస్తారు. కానీ యేసు మాత్రం అలా కాదు. ఆయన న్యాయంగా ఉంటాడు, పక్షపాతం చూపించడు. దేశం, జాతి, సంస్కృతి అనే తేడాలు ఆయనకు లేవు. కాబట్టి ఆయన ఎవ్వరిని చిన్నచూపు చూడడు. (యెషయా 11:3, 4) ప్రజలు న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే, యేసు ప్రతీ మనిషి బాగోగుల్ని పట్టించుకుంటాడు. “సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. . . . అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12-14.

దేవుని రాజ్యంలో ఆయుధాలు అనేవే ఉండవు. (మీకా 4:3) అలాగే, చెడ్డ ప్రజలు ఉండరు. అంటే, దాడులు చేసేవాళ్లు, ఇతరులకు హాని చేసేవాళ్లు ఉండరు. (కీర్తన 37:9, 10) స్త్రీలు, పురుషులు, పిల్లలు ఇలా అందరూ ఎప్పుడు ఏమౌతుందో అనే భయం లేకుండా సురక్షితంగా ఉంటారు.—యెహెజ్కేలు 34:28.

దేవుని రాజ్యంలో ప్రజలందరూ ఏ లోటు లేకుండా జీవిస్తారు. పోరాటాల వెనకున్న కారణాలన్నిటినీ ఆ రాజ్యం తీసేస్తుంది. అంటే పేదరికం, ఆహారకొరతలు, కనీస వసతులు లేని ఇళ్లు వంటి సమస్యలు ఇక ఉండవు. ప్రతిఒక్కరూ కడుపునిండా తినడానికి మంచి ఆహారం దొరుకుతుంది, అందరికీ సౌకర్యవంతమైన ఇళ్లు ఉంటాయి.—కీర్తన 72:16; యెషయా 65:21-23.

దేవుని రాజ్యం యుద్ధాల వల్ల జరిగిన నష్టాల్ని సరిచేస్తుంది. అది శరీరానికి తగిలిన గాయాల్నే కాదు, మనసులకు తగిలిన గాయాల్ని కూడా నయం చేస్తుంది. అంతేకాదు, చనిపోయినవాళ్లు ఈ భూమ్మీద తిరిగి బ్రతుకుతారు. (యెషయా 25:8; 26:19; 35:5, 6) కుటుంబాలన్నీ మళ్లీ ఒకటిగా అవుతాయి, యుద్ధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇక గుర్తుకురావు. ఎందుకంటే, ‘అంతకుముందున్న విషయాలు గతించిపోతాయి.’—ప్రకటన 21:4.

దేవుడు పాపాన్ని కడిగిపారేస్తాడు

దేవుని రాజ్యం భూమంతటిని పరిపాలించినప్పుడు ప్రజలందరూ కలిసి “ప్రేమకు, శాంతికి మూలమైన” ఒకేఒక్క సత్యదేవుడైన యెహోవానుc ఆరాధిస్తారు. (2 కొరింథీయులు 13:11) ప్రజలు శాంతిగా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. (యెషయా 2:3, 4; 11:9) ఎవరైతే నేర్చుకున్నవి పాటిస్తారో వాళ్లు పాపం నుండి విడుదల పొందుతారు.—రోమీయులు 8:20, 21.

సాతాన్ని, అతని చెడ్డదూతల్ని దేవుడు నాశనం చేసేస్తాడు

యుద్ధాల్ని ఉసిగొల్పే సాతాను, అతని చెడ్డదూతలు దేవుని రాజ్యంలో ఉండరు. (ప్రకటన 20:1-3, 10) వాళ్ల బెడద ఇక ఉండదు కాబట్టి, “శాంతి విస్తరిస్తుంది.”—కీర్తన 72:7.

యుద్ధాలు, దాడులు లేకుండా చేస్తానని దేవుడిచ్చిన మాట తప్పకుండా నిజమౌతుంది. ఎందుకంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే కోరిక, అలా చేసే సామర్థ్యం దేవునికి ఉన్నాయి.

  • యుద్ధాల్ని, హింసను లేకుండా చేసే శక్తి, తెలివి దేవునికి ఉన్నాయి. (యోబు 9:4) దేవుడు చేయలేనిది అంటూ ఏదీ లేదు.—యోబు 42:2.

  • ప్రజలు బాధపడడం చూసి దేవుడు తట్టుకోలేడు. (యెషయా 63:9) “హింసను ప్రేమించేవాళ్లంటే ఆయనకు అసహ్యం.”—కీర్తన 11:5.

  • దేవుడు అబద్ధమాడడు; ఆయన ఏదైనా చెప్పాడంటే, ఖచ్చితంగా చేసి తీరుతాడు!—యెషయా 55:10, 11; తీతు 1:2.

త్వరలో దేవుడు నిజమైన, శాశ్వతమైన శాంతిని తీసుకొస్తాడు.

పరదైసులో ఒక కుటుంబం కొండ మీద కూర్చొని సంతోషంగా నవ్వుతున్నారు. దగ్గర్లో గుర్రాలు మేస్తున్నాయి.

దేవుడు యుద్ధాలకు తెరదించుతాడు

దేవుడు యుద్ధాల్ని ఎందుకు జరగనిస్తున్నాడు?

మీకు ఈ ప్రశ్నలు వచ్చి ఉంటాయి: దేవుడు యుద్ధాల్ని ఎందుకు జరగనిస్తున్నాడు? వాటిని ఎందుకు ఆపట్లేదు? ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు? అనే వీడియోను jw.org వెబ్‌సైట్‌లో చూడండి.

a “హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ jw.orgలో చూడండి.

b దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియోను jw.orgలో చూడండి.

c యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి