కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp25 No. 1 పేజీ 9
  • యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాపం
  • మనుషుల పరిపాలన
  • సాతాను, చెడ్డదూతలు
  • యుద్ధాలు, దాడులు లేని ప్రపంచం ఎలా సాధ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • దేవుడు ఏ ఉద్దేశంతో మనుషుల్ని చేశాడు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యుద్ధాలు, దాడుల సెగ వల్ల ప్రపంచం విలవిల
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • మనుషులు ఎందుకు చనిపోతున్నారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
wp25 No. 1 పేజీ 9

యుద్ధాలు, దాడులు ఎందుకు ఆగట్లేదు?

యుద్ధాలు, దాడులు జరగడానికి కారణాలు ఏంటి? అవి ఎందుకు ఆగట్లేదు? బైబిలు ఏం చెప్తుందో చూద్దాం.

పాపం

మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వల్ని దేవుడు తన స్వరూపంలో చేశాడు. (ఆదికాండం 1:27) అంటే, ఆయన తన లక్షణాలన్నిటినీ మనిషిలో పెట్టాడు. కాబట్టి వాళ్లు శాంతిగా ఉండగలరు, ప్రేమను చూపించగలరు. (1 కొరింథీయులు 14:33; 1 యోహాను 4:8) అయితే, ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపం చేశారు. దానివల్ల, మనుషులందరికీ వారసత్వంగా పాపం, మరణం వచ్చాయి. (రోమీయులు 5:12) మనలో ఉండే పాపం కారణంగా మనకు తరచూ చెడు ఆలోచనలు వస్తాయి. దానివల్ల చాలామంది ఇతరులకు హాని చేస్తారు.—ఆదికాండం 6:5; మార్కు 7:21, 22.

మనుషుల పరిపాలన

మనుషులు ఒకరినొకరు పరిపాలించుకునే సామర్థ్యంతో దేవుడు తయారుచేయలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి [మనిషికి] లేదు.” (యిర్మీయా 10:23) కాబట్టి మనుషుల పరిపాలన యుద్ధాల్ని, హింసను పూర్తిగా ఆపలేదు.

సాతాను, చెడ్డదూతలు

“లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 5:19) ఆ ‘దుష్టుడే’ సాతాను; అతను కిరాతకుడు, హంతకుడు. (యోహాను 8:44) సాతాను తన చెడ్డదూతలతో కలిసి హింసను, యుద్ధాల్ని వెనకుండి నడిపిస్తున్నాడు.—ప్రకటన 12:9, 12.

హింసను, యుద్ధాల్ని నామరూపాల్లేకుండా చేయడం మన వల్ల కాదు, అది దేవునికే సాధ్యం.

మతం-యుద్ధం

మతాలు తరచూ యుద్ధాల్ని సమర్థిస్తాయి లేదా ప్రోత్సహిస్తాయి. అలాంటి మతాలన్నిటినీ కలిపి బైబిలు “మహాబబులోను” అని పిలుస్తుంది. (ప్రకటన 18:2) “భూమ్మీద దారుణంగా చంపబడిన వాళ్లందరి” చావులకు కారణం మహాబబులోనే అని దేవుడు చెప్తున్నాడు. (ప్రకటన 18:24) దీని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, “మహాబబులోను అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌ని jw.org వెబ్‌సైట్‌లో చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి