కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 డిసెంబరు పేజీ 8
  • పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • పత్రికలు రాజ్యాన్ని ప్రకటిస్తున్నాయి
    మన రాజ్య పరిచర్య—1998
  • సువార్తనందించుట—పత్రికలతో
    మన రాజ్య పరిచర్య—1989
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 డిసెంబరు పేజీ 8
తేజరిల్లు! పత్రికలో వచ్చిన ఒక అంశం గురించి మన సహోదరి ఒక స్త్రీతో మాట్లాడుతోంది.

మన క్రైస్తవ జీవితం

పత్రికలు ఉపయోగిస్తూ ఉండండి

2018 మొదలుకొని, ఒక్కో సార్వజనిక పత్రిక ఒక్కో అంశం గురించే చర్చిస్తుంది. ఈ పత్రికలన్నీ మన బోధనా పనిముట్లలో భాగమే. కాబట్టి మనం వాటిని పరిచర్యలో ఇవ్వవచ్చు. అంతేకాదు, ప్రయాణించేటప్పుడు లేదా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు బ్యాగులో కొన్ని పెట్టుకోవచ్చు. ఈ పత్రికలను బైబిలు స్టడీ చేయడానికి వీలుగా తయారు చేయలేదు, అయితే దేవుని గురించి ఎక్కువ నేర్చుకోవాలనే కోరికను ఇంటివ్యక్తుల్లో కలిగించడానికి ఇవి సహాయం చేస్తాయి.

ఇంటివ్యక్తితో సంభాషణ మొదలుపెట్టాక ఒక లేఖనం చూపించండి, తర్వాత ఆ వ్యక్తికి ఆసక్తికరంగా అనిపించే పత్రికను ఇవ్వండి. ఉదాహరణకు ఇంటివ్యక్తికి పిల్లలు ఉంటే, లేదా బాధలో గానీ ఒత్తిడిలో గానీ ఉంటే మీరిలా అనవచ్చు: “ఈమధ్య దీనిగురించి ఒక ఆర్టికల్‌ చదివాను. అది మీకు చూపించనా?” ఇంటివ్యక్తికి ఆసక్తి ఉందని మీరు గమనిస్తే, ఆ పత్రిక ముద్రిత కాపీని గానీ, ఎలక్ట్రానిక్‌ కాపీని గానీ ఇవ్వండి. మీరు ఆ వ్యక్తిని కలవడం అదే మొదటిసారి అయినప్పటికీ పత్రికను ఇవ్వవచ్చు. నిజమే, మన ప్రధాన లక్ష్యం పత్రికల్ని పంచిపెట్టడం కాదు. అయితే, నేర్చుకున్నవాటి ప్రకారం జీవించాలనే కోరిక ఉన్నవాళ్లను కనుగొనడానికి పత్రికలు సహాయం చేస్తాయి.—అపొ 13:48.

2018

చిత్రాలు: 2018⁠లో వచ్చిన ‘కావలికోట,’ ‘తేజరిల్లు!’ సంచికలు. 1. ‘బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా?’ 2. ‘భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?’ 3. ‘దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా?’ 4. ‘సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం.’ 5. ‘కుటుంబ విజయానికి 12 సలహాలు.’ 6. ‘మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?’

2019

చిత్రాలు: 2019⁠లో వచ్చిన ‘కావలికోట,’ ‘తేజరిల్లు!’ సంచికలు. 1. ‘దేవుడు అంటే ఎవరు?’ 2. ‘జీవితం మీద ఆశ కోల్పోకండి.’ 3. ‘జీవితం అంటే ఇంతేనా?’ 4. ‘మనం ఎప్పటికైనా క్షేమంగా, భద్రంగా ఉంటామా?’ 5. ‘పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి?’ 6. ‘మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?’

2020

చిత్రాలు: 2020⁠లో వచ్చిన ‘కావలికోట,’ ‘తేజరిల్లు!’ సంచికలు. 1. ‘సత్యం కోసం అన్వేషణ.’ 2. ‘దేవుని రాజ్యం అంటే ఏంటి?’ 3. ‘దేవుడు ప్రేమతో ఇస్తున్న శాశ్వత దీవెనలు.’ 4. ‘ఒత్తిడి నుండి బయటపడండి.’ 5. ‘బాధల గురించిన 5 ప్రశ్నలు​—⁠వాటి జవాబులు.’ 6. ‘వివక్ష అనే జబ్బును తీసేయడం సాధ్యమేనా?’

మీ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి విషయాలు చర్చించడానికి ఇష్టపడతారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి