మన క్రైస్తవ జీవితం
‘రెండు చిన్న నాణేల’ విలువ
విధవరాలు ఇచ్చిన కానుక, ఒక్కపూట భోజనం కొనుక్కోవడానికి కూడా సరిపోదు. (w97 10/15 16-17 పేజీలు, 16వ పేరా, అధస్సూచి చూడండి.) అయితే, యెహోవా ఏర్పాట్ల పట్ల ఆమెకు ఎంత ప్రేమ, కృతజ్ఞత ఉన్నాయో ఆ విరాళం చూపించింది. అందుకే ఆమె పరలోక తండ్రి ఆ రెండు నాణేలను చాలా విలువైనవిగా చూశాడు.—మార్కు 12:43.
‘మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి’ అనే వీడియో చూడండి; తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
విరాళాలు ఎలాంటి పనుల కోసం ఉపయోగపడతాయి?
మనం ఇచ్చే విరాళం తక్కువగా అనిపించినప్పటికీ, అది ఎందుకు విలువైనది?
విరాళం ఇవ్వడానికి సంబంధించి మన ప్రాంతంలో ఉన్న అవకాశాల గురించి ఎలా తెలుసుకోవచ్చు?—“ఆన్‌లైన్‌లో మరింత తెలుసుకోండి” అనే బాక్సు చూడండి