కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 నవంబరు పేజీ 32
  • మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ‘రెండు చిన్న నాణేల’ విలువ
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • మీరు చూపిస్తున్న ప్రేమకు యెహోవాకు కృతజ్ఞతలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 నవంబరు పేజీ 32
donate.jw.org

మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు?

ఒకసారి యేసు ఇలా అన్నాడు, “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) ఈ సూత్రం, యెహోవాతో మనకున్న సంబంధం విషయంలో కూడా వర్తిస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మనం సంతోషంగా ఉండడానికి యెహోవా ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. అయితే, ఆయనకు తిరిగి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ సంతోషిస్తాం. మరి ఆయనకు మనం ఏ బహుమానం ఇవ్వవచ్చు? ‘నీకున్న విలువైన వాటితో యెహోవాను ఘనపర్చు’ అని బైబిలు చెప్తుంది. (సామె. 3:9, NW) ఆ ‘విలువైన వాటిలో’ మన సమయం, సామర్థ్యాలు, బలం, ఆర్థిక వనరులు ఉన్నాయి. సత్యారాధన కోసం వాటిని ఉపయోగించినప్పుడు, మనం యెహోవాకు బహుమానం ఇచ్చిన వాళ్లమౌతాం. అంతేకాదు దానివల్ల చాలా సంతోషం కలుగుతుంది.

యెహోవాకు బహుమానం ఇవ్వడానికి మన ఆర్థిక వనరుల్ని ఎలా ఉపయోగించవచ్చు? విరాళం కోసం ‘కొంత తీసి పక్కకు పెట్టమని’ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పాడు. (1 కొరిం. 16:2) మీ ప్రాంతంలో ఏయే విధాలుగా విరాళం ఇవ్వవచ్చో తెలుసుకోవడానికి దయచేసి కిందున్న బాక్సు చూడండి.

ఆన్‌లైన్‌లో విరాళం ఇచ్చే ఏర్పాటు అన్నిదేశాల్లో లేదు. కానీ విరాళం ఇచ్చే ఇతర మార్గాల గురించిన సమాచారం “ప్రపంచవ్యాప్త పని కోసం విరాళం ఇవ్వడమెలా” అనే వెబ్‌ పేజీలో ఉంది. కొన్ని దేశాల్లో, విరాళాలకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులు ఉన్న డాక్యుమెంట్‌ని jw.org హోమ్‌ పేజీలో ఉంచారు.

ఆన్‌లైన్‌లో విరాళం ఇవ్వడానికి సులువైన పద్ధతి

తేలిగ్గా కనుక్కోవచ్చు

  • వెబ్‌ బ్రౌజర్‌

    వెబ్‌ బ్రౌజర్‌లో donate.jw.org అని టైప్‌ చేయండి

  • JW లైబ్రరీ

    JW లైబ్రరీ® యాప్‌లోని హోమ్‌ పేజీలో, “ప్రపంచవ్యాప్త పనికి మద్దతివ్వండి” అనే ఐకన్‌ని క్లిక్‌ చేయండి

తేలిగ్గా ఉపయోగించవచ్చు

ఈ కింది వాటికి ఒక్కసారి విరాళం ఇవ్వవచ్చు లేదా రికరింగ్‌ విరాళం ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు:

  • ప్రపంచవ్యాప్త పని

  • మీ సంఘం

  • ప్రాదేశిక సమావేశం

  • ప్రాంతీయ సమావేశం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి