కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 అక్టోబరు పేజీ 5
  • యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • నా ప్రాణ స్నేహితుడు ఇల్లెందుకు మారాడు?
    తేజరిల్లు!—1997
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 అక్టోబరు పేజీ 5
టేబుల్‌ దగ్గర కూర్చున్న యౌవన సహోదరుడు వ్యక్తిగత అధ్యయనంలో మునిగిపోయాడు.

మన క్రైస్తవ జీవితం

యౌవనులారా—యెహోవా మీకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడా?

ఒక స్నేహితునిలో మీరు ఎలాంటి లక్షణాల కోసం చూస్తారు? బహుశా నమ్మకంగా, దయగా, ఉదారంగా ఉండేవాళ్లను మీరు ఇష్టపడుతుండవచ్చు. యెహోవా ఆ లక్షణాలన్నిటిని చూపిస్తాడు. (నిర్గ 34:6; అపొ 14:17) మీరు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు. (కీర్త 18:19, 35) మీ తప్పుల్ని క్షమిస్తాడు. (1యో 1:9) యెహోవా ఎంత మంచి స్నేహితుడో కదా!

యెహోవాకు స్నేహితులవ్వాలంటే మీరేం చేయాలి? ఆయన వాక్యాన్ని చదివి ఆయన గురించి తెలుసుకోండి. ప్రతీది ఆయనతో పంచుకోండి. (కీర్త 62:8; 142:2) యెహోవాకు ప్రాముఖ్యమైనవి, అంటే ఆయన కుమారుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన చేసిన భవిష్యత్తు వాగ్దానాల్ని విలువైనవిగా ఎంచుతున్నారని చూపించండి. ఆయన గురించి ఇతరులకు చెప్పండి. (ద్వితీ 32:3) యెహోవాతో దగ్గరి స్నేహాన్ని పెంచుకుంటే, ఆయన ఎప్పటికీ మీకు స్నేహితునిగా ఉంటాడు.—కీర్త 73:25, 26, 28.

యౌవనులారా—“యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి,” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘యౌవనులారా—యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి’ వీడియోలోని ఒక సన్నివేశం. వ్యక్తిగత అధ్యయనం మొదలుపెట్టక ముందు ప్రార్థిస్తున్న ఒక యౌవన సహోదరి.

    సమర్పణ, బాప్తిస్మానికి మీరు ఎలా సిద్ధపడవచ్చు?

  • ‘యౌవనులారా—యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి’ వీడియోలోని ఒక సన్నివేశం. ఒక పయినీరు సహోదరుడు కారెన్‌ (సగో) భాష మాట్లాడే వ్యక్తికి ఒక లేఖనాన్ని చూపిస్తున్నాడు.

    యెహోవా సేవ చేయడానికి సంఘంలోని వాళ్లు మీకు ఎలా సహాయం చేయగలరు?

  • ‘యౌవనులారా—యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి’ వీడియోలోని ఒక సన్నివేశం. వృద్ధుల సహాయాన్ని విలువైనదిగా ఎంచే ఒక యౌవన సహోదరుడు వృద్ధ సహోదరునితో కలిసి పరిచర్యకు వెళ్తున్నాడు.

    పరిచర్య యెహోవాతో మీకున్న సంబంధాన్ని ఎలా బలపరుస్తుంది?

  • ‘యౌవనులారా—యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి’ వీడియోలోని ఒక సన్నివేశం. ఒక సహోదరి తన ఇంటి దగ్గర నుండి రెండు గంటలు నడిచి వెళ్లి, ఒక చెవిటి అమ్మాయితో బైబిలు స్టడీ చేస్తుంది.

    యెహోవాతో స్నేహం ఎప్పటికీ ఉంటుంది!

    యెహోవా సేవలో మీరు ఎలాంటి నియామకాలు చేపట్టగలరు?

  • యెహోవాలో మీకు బాగా నచ్చేది ఏంటి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి