దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 6-8
అతను దేవుడు చెప్పినట్టే చేశాడు
నోవహు, అతని కుటుంబం ఇప్పుడున్న పనిముట్లు, మెషీన్లు, నిర్మాణ పద్ధతులు ఉపయోగించకుండా ఓడను కట్టారంటే ఎంత కష్టపడి ఉంటారో ఊహించండి.
ఆ ఓడ ఎంత పెద్దదంటే, దాదాపు 437 అడుగుల (133 మీటర్లు) పొడవు, 73 అడుగుల (22 మీటర్లు) వెడల్పు, 44 అడుగుల (13 మీటర్లు) ఎత్తు ఉండేది
ఓడను చేయడానికి చెట్లను నరికి, వాటిని కావాల్సిన సైజులో, ఆకారంలో కోసి, ఎత్తి అమర్చాలి
అంత పెద్ద ఓడకు, లోపల బయట తారు పూయాలి
నోవహు కుటుంబానికి, అలాగే జంతువులకు ఒక సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని నిల్వ చేయాలి
ఆ పనులన్నీ పూర్తి చేయడానికి దాదాపు 40 నుండి 50 సంవత్సరాలు పట్టి ఉండవచ్చు
యెహోవా మన నుండి కోరేవాటిని చేయడం కష్టంగా అనిపించినప్పుడు, నోవహు ఉదాహరణ మనకు ఎలా ప్రోత్సాహాన్నిస్తుంది?