దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 పేతురు 3-5
“అన్నిటి అంతం దగ్గరపడింది”
ఈ ప్రపంచం ఇప్పటివరకు చూడని మహాశ్రమను మనం త్వరలో ఎదుర్కొంటాం. మనం ఇప్పుడు, భవిష్యత్తులో ఆధ్యాత్మికంగా బలంగా ఎలా ఉండగలం?
ప్రార్థన చేయడం మానకండి. అన్ని విధాలుగా ప్రార్థించండి, అంటే స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి, విజ్ఞాపనలు చేయండి
మన క్రైస్తవ సహోదరసహోదరీల మీద ప్రగాఢమైన ప్రేమను పెంచుకోండి, వాళ్లకు బాగా దగ్గరౌతూ ఉండండి
మంచి ఆతిథ్య స్ఫూర్తిని చూపించండి
ఈ ప్రశ్న వేసుకోండి: ‘స్థానికంగా ఉన్న సహోదరసహోదరీల పట్ల, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీల పట్ల నేను ప్రగాఢమైన ప్రేమను, మంచి ఆతిథ్య స్ఫూర్తిని ఎలా చూపించవచ్చు?’