సహోదరులను ఇంటికి ఆహ్వానించి మీకున్న మంచి విషయాలను ఇవ్వండి (మత్త. 12:35ఎ)
మన ఇంటికి పిలిచి మన దగ్గరున్న మంచి విషయాలను సహోదరులకు ఇవ్వాలని మనందరికి అనిపిస్తుంది. (రోమా. 12:13) వేరే సంఘం నుండి ప్రసంగమివ్వడానికి వచ్చిన సహోదరుల ప్రయాణ ఖర్చులు, భోజన ఏర్పాట్లు సంఘ పెద్దలు చూసుకుంటారు. కాని, మనకు అంత పెద్ద ఇల్లు లేదని లేకపోతే ఇంటికి పిలవడానికి భయంతోనో మొహమాట పడుతుంటాము. మార్తకు యేసు చెప్పిన మాటలు ఆలోచిస్తే మనం అలాంటి మొహమాటం నుండి బయటపడతాం. (లూకా 10:39-42) ఇతరులను మన ఇంటికి పిలవడానికి పెద్దపెద్ద ఇళ్లు ఉండడం, రకరకాల వంటలు చేసి పెట్టడం ముఖ్యం కాదు, వాళ్లతో సమయం గడపడం, ప్రోత్సహించుకోవడమే “ఉత్తమం” అని యేసు చెప్పాడు. యేసు చెప్పిన ఈ మాటలను మనసులో ఉంచుకుని దేవుని వాక్యం ప్రకారం మనకున్న మంచి విషయాలను సహోదరులకు ఇద్దాం.—3 యోహా. 5-8.