మన క్రైస్తవ జీవితం
పవిత్ర ప్రవర్తన, ప్రగాఢ గౌరవం మీ వివాహజతను సత్యం వైపు నడిపిస్తాయి
విశ్వాసంలోకి వచ్చిన చాలామంది స్త్రీలు క్రీస్తులాంటి ప్రవర్తన ద్వారా తమ భర్తల్ని సత్యంలోకి తీసుకొస్తారు. కానీ అందుకోసం వాళ్లు ఎన్నో సంవత్సరాలు కష్టాల్ని సహించాల్సి రావచ్చు. (1 పేతు 2:21-23; 3:1, 2) మీరు అన్యాయంగా కష్టాల్ని అనుభవిస్తున్నట్లయితే, మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ ఉండండి. (రోమా 12:21) కేవలం మాటల ద్వారా సాధించలేని దాన్ని మీ మంచి ప్రవర్తన ద్వారా సాధించవచ్చు, మీ భర్తను సత్యం వైపు నడిపించవచ్చు.
పరిస్థితిని మీ భర్త లేదా భార్య దృష్టితో చూడడానికి ప్రయత్నించండి. (ఫిలి 2:3, 4) సహానుభూతిని, కనికరాన్ని చూపించండి, మీ బాధ్యతల్ని గౌరవంగా నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేయండి. చక్కగా వినండి. (యాకో 1:19) సహనంతో ఉండండి, మీరు మీ భర్తను ప్రేమిస్తున్నారనే భరోసాను ఇవ్వండి. మీరు చూపించేలాంటి దయను, గౌరవాన్ని మీ వివాహజత మీపై ఎన్నడూ చూపించకపోయినా, మీరు నమ్మకంగా ఉంటున్నందుకు యెహోవా మిమ్మల్ని ఎంతో విలువైనవాళ్లుగా చూస్తాడనే ధైర్యంతో ఉండండి.—1 పేతు 2:19, 20.
భారాల్ని మోసేలా యెహోవా మనల్ని బలపరుస్తాడు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
పెళ్లయిన కొత్తలో గ్రేస్ లీ జీవితం ఎలా ఉండేది?
ఏది ఆమెను బైబిలు సత్యం వైపుకు ఆకర్షించింది?
బాప్తిస్మం తీసుకున్న తర్వాత వచ్చిన కష్టాల్ని సహోదరి లీ ఎలా తట్టుకుంది?
తన భర్త గురించి సహోదరి లీ ఏమని ప్రార్థన చేసేది?
తన పవిత్ర ప్రవర్తన, ప్రగాఢ గౌరవం ద్వారా సహోదరి లీ ఏ ఆశీర్వాదాలు పొందింది?
పవిత్ర ప్రవర్తన, ప్రగాఢ గౌరవం చాలా శక్తివంతమైనవి!