దేవుని వాక్యంలో ఉన్న సంపద | కొలొస్సయులు 1-4
మీ పాత వ్యక్తిత్వాన్ని తీసిపారేయండి, కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి
మీరు సత్యంలోకి వచ్చాక మీ వ్యక్తిత్వంలో పెద్దపెద్ద మార్పులు చేసుకున్నారా? యెహోవా మీ ప్రయత్నాల్ని చూసి సంతోషించాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు. (యెహె 33:11) అయితే పాత వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలు మళ్లీ రాకుండా చూసుకోవడానికి, అలాగే కొత్త వ్యక్తిత్వాన్ని చూపిస్తూ ఉండడానికి మీరు ఎప్పుడూ కృషి చేస్తూ ఉండాలి. మీరింకా ఏయే విషయాల్లో మెరుగుపడాలో తెలుసుకోవడానికి కింద ఉన్న ప్రశ్నల గురించి ఆలోచించండి:
నన్ను బాధపెట్టినవాళ్ల మీద నా మనసులో ఇంకా కోపం పెట్టుకున్నానా?
నేను తొందర్లో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు కూడా సహనాన్ని చూపిస్తున్నానా?
ఏదైనా చెడు ఆలోచన వస్తే వెంటనే తీసేసుకుంటున్నానా?
వేరే జాతి, దేశానికి చెందినవాళ్ల గురించి నాకు తప్పుడు అభిప్రాయం ఉందా?
ఈమధ్య ఎవరితోనైనా దురుసుగా మాట్లాడానా? లేదా ఎవరిమీదైనా కోపాన్ని చూపించానా?