మన క్రైస్తవ జీవితం
మన ఆరాధనా స్థలాలను జాగ్రత్తగా చూసుకోవడానికి అందరూ ఏం చేయవచ్చు?
మన రాజ్యమందిరాలు కేవలం భవనాలు కాదు, అవి యెహోవాకు సమర్పించిన ఆరాధనా స్థలాలు. రాజ్యమందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనలో ప్రతీ ఒక్కరం ఏమి చేయవచ్చు?
మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం (వీడియో విభాగంలో మన కూటాలు, పరిచర్య) వీడియో చూడండి, తర్వాత కింది ప్రశ్నలకు జవాబు చెప్పండి:
ఆరాధనా స్థలాల ఉద్దేశం ఏమిటి?
మనం రాజ్యమందిరాన్ని ఎందుకు శుభ్రంగా, మంచిస్థితిలో ఉంచాలి?
మెయింటెనెన్స్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీరెలా ప్రయోజనం పొందారు?
భద్రత ఎందుకు ప్రాముఖ్యం? దానికి సంబంధించి ఈ వీడియోలో మీరు ఎలాంటి విషయాలు గమనించారు?
మన విరాళాలతో యెహోవాను ఎలా ఘనపర్చవచ్చు?
నేను ఇలా పాల్గొనాలని అనుకుంటున్నాను.