మన క్రైస్తవ జీవితం
మన సహాయక చర్యల వల్ల కరీబియన్ దీవుల్లో ఉన్న క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందారు?
మొదటి శతాబ్దంలోలాగే, విపత్తుల వల్ల కష్టాల్లో ఉన్న తోటి క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించే గొప్ప అవకాశం మనకు కూడా ఉంది. (యోహా 13:34, 35) కరీబియన్‌లో నివసిస్తున్న మన సహోదరసహోదరీల అవసరాలు తీర్చడానికి తోటి క్రైస్తవులు ఏంచేశారో తెలుసుకునేందుకు, ప్రేమను చేతల్లో చూపించడం—దీవుల్లో సహాయక చర్యలు అనే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
ఇర్మా, మారియ తుఫానుల వల్ల కరీబియన్‌లోని మన సహోదరులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?
కరీబియన్‌లో ఉన్న మన సహోదరులకు తోటి క్రైస్తవుల ద్వారా యెహోవా ఎలా సహాయం చేశాడు?
తోటి సహోదరులు చూపించిన ప్రేమ, ఔదార్యం కష్టాల్లోవున్న ఆ సహోదరుల మీద ఎలాంటి ప్రభావం చూపించాయి?
కరీబియన్‌లో విపత్తు సహాయక చర్యల్లో ఎంతమంది సహోదరసహోదరీలు పాల్గొన్నారు?
విపత్తు సహాయక చర్యల్లో పాల్గొనడానికి మనమంతా ఏం చేయవచ్చు?
ఈ వీడియో చూసిన తర్వాత, ప్రేమగల సంస్థలో భాగంగా ఉండడం గురించి మీరెలా భావిస్తున్నారు?