కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/05 పేజీ 3
  • మనం ఎలా సహాయం చేయవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ఎలా సహాయం చేయవచ్చు?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటారా?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • “మీ చేతులతో యెహోవాకు బహుమానం ఇవ్వండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • విపత్తు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 11/05 పేజీ 3

మనం ఎలా సహాయం చేయవచ్చు?

1 ప్రపంచంలోని ఏదో ఒక ప్రదేశంలో విపత్తు సంభవించిందని విన్నప్పుడు, యెహోవాసాక్షులు “మేమేదైనా సహాయం చేయవచ్చా?” అని తరచూ అడుగుతుంటారు. అపొస్తలుల కార్యములు 11:27-30 లోని వృత్తాంతం చూపిస్తున్నట్లు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు యూదయలో క్షామం సంభవించడంతో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న సహోదరులకు సహాయ సామగ్రిని అందించారు.

2 ఆధునిక కాలాల్లో, దానధర్మాల కార్యక్రమాలకూ, ప్రకృతి వైపరీత్యాలవల్ల లేక మానవుల మూలంగా కలిగే వైపరీత్యాలవల్ల బాధపడుతున్నవారికి మానవతా దృక్పథంతో సహాయం అందించడానికీ, అవసరమున్న ఇతర సమయాల్లోనూ డబ్బును ఉపయోగించేందుకు మన సంస్థాగత నియమాలు అనుమతిస్తున్నాయి.

3 ఉదాహరణకు, గత ఏడాది చాలామంది సహోదరులు, దక్షిణ ఆసియాలో సంభవించిన సునామీ విపత్తువల్ల ప్రభావితులైనవారికి సహాయం చేయడానికి ఆర్థిక మద్దతునిచ్చారు. సంస్థ సహాయ నిధులకు ఆర్థిక విరాళాలు పంపించడం ద్వారా వారు యథార్థంగా స్పందించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అయితే విరాళాలు ఒక నిర్దిష్ట విపత్తు కోసమే అని పేర్కొనబడినట్లయితే కొన్ని దేశాల్లో అలాంటి నిధులను, దాత పేర్కొన్న ఉద్దేశానికే నిర్దిష్ట కాలవ్యవధిలో ఉపయోగించవలసి ఉంటుంది. ఒకవేళ సహోదరులకు అప్పటికే సహాయక చర్యలు అందినా, అవసరానికి మించిన విరాళాలు అందినా అలాగే చేయవలసి ఉంటుంది.

4 కాబట్టి, మానవతా దృక్పథంతో ఇచ్చే విరాళాలు, సహాయక చర్యల కోసం ఇచ్చే విరాళాలు ప్రపంచవ్యాప్త పని కోసమనే పంపించాలని సిఫారసు చేయబడుతోంది. ఆ నిధి సహాయక చర్యల కోసం ఉపయోగించబడడమే కాక క్రైస్తవ సహోదరత్వానికి సంబంధించిన ఆధ్యాత్మిక అవసరాలకు మద్దతు ఇవ్వడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఏదో కారణంగా ఒక వ్యక్తి సహాయక చర్యల కోసం ఇచ్చే విరాళాలను ప్రపంచవ్యాప్త పని కోసం కాక వేరుగా పంపించాలనుకున్నట్లయితే ఆ విరాళం కూడా అంగీకరించబడుతుంది, సహాయక చర్యల అవసరం ఉన్న చోట అది ఉపయోగించబడుతుంది. అయితే అలాంటి విరాళాలు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాల్లో ఎలాంటి షరతులు లేకుండా పంపిస్తే మంచిది.

5 మనం విరాళాలను ప్రాథమికంగా ప్రపంచవ్యాప్త పనికోసం ఇవ్వడం, భవిష్యత్తు సహాయక అవసరాల కోసమే విరాళాలను నిలిపి ఉంచే బదులు, రాజ్యపనికి సంబంధించిన రంగాలన్నిటిలో ఉపయోగించడానికి అధిక నిధులు అందుబాటులో ఉండేలా వీలుకల్పిస్తుంది. అది, “ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజే[యడానికి]” అవసరమైన దానిని ఇవ్వడానికి మనం కలిసికట్టుగా పనిచేయాలని, ఎఫెసీయులు 4:16లో పేర్కొనబడిన స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి