మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం మన టెరిటరీలో ప్రతి ఒక్కరిని కలవండి
ఎందుకు ప్రాముఖ్యం: అన్ని దేశాల ప్రజలు మంచివార్తకు చక్కగా స్పందిస్తారని జెకర్యా ప్రవచించాడు. (జెక 8:23) కానీ వాళ్లందరికీ ఎవరు బోధిస్తారు? (రోమా 10:13-15) మన టెరిటరీలో ప్రతి ఒక్కరికి మంచివార్త చెప్పే గొప్ప అవకాశం, బాధ్యత మనకు ఉన్నాయి. —od 84వ పేజీ, 10-11 పేరాలు.
ఎలా చేయాలి:
సిద్ధపడండి. మీకు వేరే భాష మాట్లాడే ప్రజలు కలుస్తారా? మీరు JW లాంగ్వేజ్ యాప్ ఉపయోగించి సులువుగా ఎలా మాట్లాడవచ్చో కొన్ని మాటలు నేర్చుకోవచ్చు. లేదా మీ మొబైల్ ఉపయోగించి jw.orgలో వాళ్ల భాషలో సమాచారాన్ని ఎలా చూసుకోవచ్చో చెప్పవచ్చు
బాగా గమనించండి. మీరు ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు అటువైపుగా వెళ్తున్నవాళ్లకు, కార్లలో వెయిట్ చేస్తున్నవాళ్లకు సాక్ష్యం ఇవ్వడానికి మీకు దొరికే అవకాశాల్ని చూసీచూడనట్లు వదిలేయకండి. మీరు బహిరంగ పరిచర్య చేస్తుంటే, సాక్ష్యం ఇవ్వాలనే మీ లక్ష్యంపైన మనసు పెట్టండి
శ్రద్ధగా ప్రయత్నించండి. మొదటిసారి ఇంట్లో కలవని వాళ్లను కలవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ప్రతి ఇంటిలో ఒకరినైనా కలవడానికి వేర్వేరు సమయాల్లో వారంలో వేర్వేరు రోజుల్లో వెళ్లండి. కొంతమందిని లెటర్ ద్వారా, ఫోన్ ద్వారా లేదా వీధి సాక్ష్యం ద్వారా కలవవచ్చు
కలుస్తూనే ఉండండి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే త్వరగా కలవండి. వేరే భాష మాట్లాడే వాళ్లు ఉంటే, వాళ్లకు సహాయం చేయడానికి వాళ్ల భాష మాట్లాడగలిగినవాళ్లు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఇంటివాళ్ల భాష మాట్లాడే ప్రచారకులు వాళ్లను కలిసేవరకు మీరు వాళ్లను కలుస్తూనే ఉండండి.—od 94వ పేజీ, 39-40 పేరాలు
“భూమంతా” పరిచర్య అనే వీడియో చూసి ఈ ప్రశ్నలు చర్చించండి:
మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలను కలవడానికి సహోదరసహోదరీలు ఎలా సిద్ధపడ్డారు? (1 కొరిం 9:22, 23)
వాళ్లు ఏ అడ్డంకులు అధిగమించాల్సి వచ్చింది?
వాళ్లు ఏ ఆశీర్వాదాలు రుచి చూశారు?
మీ టెరిటరీలో ఎక్కువమందిని కలవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు?