మన క్రైస్తవ జీవితం
నేను ఈసారి ఆగ్జిలరీ పయినీరింగ్ ఎప్పుడు చేయవచ్చు?
యెహెజ్కేలుకు వచ్చిన దేవాలయ దర్శనం, యెహోవా ప్రజలు స్వచ్ఛంద విరాళాలు ఇస్తారని చూపిస్తుంది. స్తుతియాగాలు చేసే విషయంలో మన వంతుగా మనం ఏమి చేయవచ్చు?—హెబ్రీ 13:15, 16.
ఆగ్జిలరీ పయినీరింగ్ ఒక మంచి పద్ధతి. 2018 సేవా సంవత్సరంలో ఐదు శనివారాలు లేదా ఐదు ఆదివారాలు ఉన్న నెలలు ఎక్కువ ఉన్నాయి. రోజంతా ఉద్యోగం లేదా పని చేస్తూ, వారాంతాల్లోనే ఎక్కువ పరిచర్య చేయగలిగినవాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రచారకులు మార్చి, ఏప్రిల్ నెలల్లో మరియు ప్రాంతీయ పర్యవేక్షకుడు సందర్శించే నెలల్లో 30 లేదా 50 గంటలు చేయాలని నిర్ణయించుకోవచ్చు.
ఆగ్జిలరీ పయినీరింగ్ చేయడానికి మన పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ఏమి చేయవచ్చు? మన పరిచర్య మెరుగుపర్చుకోవచ్చు, లేదా పరిచర్యలో ఎక్కువ సమయం గడపడానికి కష్టపడవచ్చు. మన పరిస్థితులు ఏమైనప్పటికీ, యెహోవా మీద మనకున్న ప్రేమ 2018 సేవా సంవత్సరంలో మనం సాధ్యమైనంత ఎక్కువ సేవ చేయడానికి నడిపిస్తుందని ఆశిద్దాం.—హోషే 14:2.
నేను సబీనా ఎర్నాండెస్ చూపించిన ఆసక్తిని ఎలా అనుకరించవచ్చు?
యెహోవా సహాయంతో నేను ఏదైనా చేయగలను అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
యెహోవాకు ఎక్కువ సేవ చేయడానికి సబీనాను ఏది పురికొల్పుతుంది?
సబీనా ఉదాహరణ మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?
2018 సేవా సంవత్సరంలో ఏ నెలల్లో మీరు ఆగ్జిలరీ పయినీరింగ్ చేయగలరు?