మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—స్టడీ తీసుకునే వాళ్లు దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
ఎందుకు ప్రాముఖ్యం? యెహోవా ఆమోదం పొందాలంటే బైబిలు విద్యార్థులు వాళ్ల జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడం తప్పనిసరి. (1 పేతు 3:21) సమర్పణకు తగ్గట్టుగా జీవించేవాళ్లకు ఆధ్యాత్మిక కాపుదల ఉంటుంది. (కీర్త 91:1, 2) సమర్పణ యెహోవాకు చేసుకోవాలి, ఒక మనిషికి, ఒక పనికి, ఒక సంస్థకి కాదు. కాబట్టి విద్యార్థులు దేవునిమీద, ప్రేమను కృతజ్ఞతను పెంచుకోవాలి.—రోమా 14:7, 8.
ఎలా చేయాలి?
స్టడీ చేస్తున్నప్పుడు, ఆ సమాచారం యెహోవా గురించి ఏమి చెప్తుందో చర్చించండి. ప్రతీరోజు బైబిలు చదవమని, “యెడతెగక” యెహోవాకు ప్రార్థించమని ప్రోత్సహించండి.—1 థెస్స 5:15-18; యాకో 4:8
సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం లాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోమని మీ విద్యార్థులకు చెప్పండి. ఈలోగా మీటింగ్స్‌లో కామెంట్స్ చేయడం, పొరుగువాళ్లకు, తోటి ఉద్యోగస్థులకు నేర్చుకున్న విషయాలు చెప్పడం లాంటి చిన్న లక్ష్యాలు పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఆయనను సేవించాలని యెహోవా ఎవర్నీ బలవంతం చేయడు. సమర్పణ ఎవరికి వాళ్లు తీసుకునే స్వంత నిర్ణయం.—ద్వితీ 30:19, 20
యెహోవాను సంతోషపెట్టడానికి, బాప్తిస్మానికి అర్హులు అవడానికి అవసరమైన మార్పులు చేసుకునేలా మీ విద్యార్థులను ముందుకు నడిపించండి. (సామె 27:11) కొన్ని అలవాట్లు, లక్షణాలు లోతుగా పాతుకుపోయి ఉంటాయి కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి బైబిలు విద్యార్థికి ఎప్పటికప్పుడు సహాయం అవసరం కావచ్చు. (ఎఫె 4:22-24) “బైబిలు జీవితాలను మారుస్తుంది” అనే అంశంతో వచ్చే ఆర్టికల్స్‌లో సమాచారాన్ని వాళ్లకు చెప్తుండండి
యెహోవా సేవ చేస్తూ మీరు ఎంత ఆనందాన్ని పొందుతున్నారో వాళ్లకు చెప్పండి.—యెష 48:17, 18