దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 87-91
మహోన్నతుని చాటున నిలిచి ఉండండి
యెహోవా “చాటున” ఉంటే మనం ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉండవచ్చు
యెహోవా చాటున నివసించాలంటే ఇప్పుడు మనం ఆయనకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవాలి
దేవున్ని నమ్మనివాళ్లకు ఈ చాటు గురించి తెలియదు
యెహోవా చాటున ఉన్నవాళ్లు దేవునిపై వాళ్లకున్న విశ్వాసాన్ని, ప్రేమను తగ్గించే దేన్నీ, ఎవర్నీ చేరనివ్వరు
వేటగాడు మనల్ని వలలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు
పక్షులు చాలా జాగ్రత్తగా ఉంటాయి, వాటిని పట్టుకోవడం కష్టం
వేటగాళ్లు పక్షుల అలవాట్లను బాగా గమనించి, వాటి ప్రకారం రకరకాల పద్ధతులు కనిపెడతారు
వేటగాడైన సాతాను యెహోవా ప్రజలను బాగా గమనించి, వాళ్లు దేవునికి దూరమైపోయేలా వలలు తయారుచేస్తాడు
సాతాను ఉపయోగించే నాలుగు అతిప్రమాదకరమైన వలలు:
మనుషుల భయం
డబ్బు, వస్తువుల మీద ఆశ
చెడు వినోదం
అభిప్రాయభేదాలు