ఆస్ట్రియాలోని వియన్నాలో ఇంటర్‌కామ్ ద్వారా సాక్ష్యం ఇస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 మొదటి పేజీ )
ప్రశ్న: ఇంటివాళ్లకు చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? కరపత్రాన్ని ఇవ్వండి. “మేము ఈరోజు వీటిని అందరికీ ఇస్తున్నాం. ఇందులో చాలామంది అడిగే ప్రశ్న గురించి ఉంది? మీరూ దాన్ని చూడవచ్చు” అని కరపత్రంపై ఉన్న ప్రశ్న చూపిస్తూ “ఇది చాలా మంచి ప్రశ్న కదండీ? దీని గురించి మీరేమంటారు? అవును? కాదు? చెప్పలేం?”
వచనం: 1 కొరిం 15:26
ఇలా చెప్పవచ్చు: పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కరపత్రాన్ని చదవండి.
చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35 రెండవ పేజీ)
ప్రశ్న: చాలామంది వాళ్ల కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని పోగొట్టుకుని ఉంటారు. వాళ్లను మళ్లీ చూసే అవకాశం ఉందంటారా?
వచనం: అపొ 24:15
ఇలా చెప్పవచ్చు: దీనివల్ల మనకు ఏ ప్రయోజనాలు ఉంటాయో ఈ కరపత్రంలో ఉంది.
దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి
ప్రశ్న: కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు దేవునికి ప్రార్థిస్తారు. దేవుడు మన ప్రార్థనలు విని, వాటికి జవాబు ఇస్తాడంటారా?
వచనం: 1 పేతు 3:12
ఇలా చెప్పవచ్చు: ఈ పుస్తకంలో దేవుని గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. [24, 25 పేజీలు చూపించండి.]
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.