ప్రశ్నాభాగం
◼ బైబిలు అధ్యయనాన్ని ఎప్పుడు ఆపేయవచ్చు?
ఒక బైబిలు విద్యార్థి ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే, మీరు అతనితో బైబిలు అధ్యయనాన్ని నేర్పుగా ఆపేయాల్సి రావచ్చు. (మత్త. 10:11) ఈ విషయాల్ని పరిశీలించండి: మీరు అధ్యయనానికి వెళ్లినప్పుడు అతను ఉంటున్నాడా? అతను అధ్యయనానికి ముందుగానే సిద్ధపడుతున్నాడా? అతను ఎప్పుడైనా సంఘ కూటాలకు హాజరయ్యాడా? తాను నేర్చుకుంటున్న విషయాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నాడా? బైబిలు సూత్రాలకు అనుగుణంగా తన జీవితంలో మార్పులు చేసుకుంటున్నాడా? వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని వయసును, సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోండి. అంతేకాదు, ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ప్రగతి సాధిస్తాడని గుర్తుంచుకోండి. అయితే ఒకవేళ మీరు అధ్యయనాన్ని ఆపేసినా, తనకు ఇష్టమైనప్పుడు మళ్లీ అధ్యయనాన్ని ప్రారంభిస్తానని అతనికి చెప్పండి.—1 తిమో. 2:4.