దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2015, డిసెంబరు 28తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడుతున్నప్పుడు పరిశోధన చేయడానికి వీలుగా, ప్రతీ ప్రశ్నను ఎప్పుడు చర్చిస్తారో ఆ తేదీని కూడా ఇచ్చారు.
1. కొందరు భావిస్తున్నట్లుగా 1 దినవృత్తాంతములు 20:3లో ఉన్నట్లు దావీదు తన బందీలను క్రూరంగా హింసించాడా? [నవం. 2, w05 2/15 27వ పేజీ]
2. దావీదు ఉదార స్వభావాన్ని ఎందుకు చూపించాడు, మనం కూడా అలానే ఉండాలంటే ఏం చేయాలి? (1 దిన. 22:5) [నవం. 9, w05 10/1 11వ పేజీ, 7వ పేరా]
3. దావీదు సొలొమోనుతో ‘నీ తండ్రియొక్క దేవున్ని . . . తెలిసికొని’ అన్నాడు. ఆయన మాటలకు అర్థం ఏమిటి? (1 దిన. 28:9) [నవం. 16, w11 4/1 26వ పేజీ, 3, 7 పేరాలు]
4. 2 దినవృత్తాంతములు 1:10లో సొలొమోను చేసిన ప్రార్థన బట్టి ఆయన గురించి ఏం తెలుస్తుంది? మనం యెహోవాకు చేసే వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఎలా ఉన్నాయో చూసుకుంటే మనమేమి నేర్చుకోవచ్చు? (2 దిన. 1:10-12) [నవం. 23, w05 12/1 19వ పేజీ, 6వ పేరా]
5. 2 దినవృత్తాంతములు 6:29, 30 ప్రకారంగా యెహోవాకు ఎలాంటి సామర్థ్యం ఉంది? మనం ప్రార్థించేటప్పుడు ఆయనతో మనసు విప్పి ఎందుకు మాట్లాడాలి? (కీర్త. 55:22) [నవం. 30, w11 4/1 19వ పేజీ, 7వ పేరా]
6. అతి పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు విజయం కోసం ఆసా దేన్నిబట్టి ప్రార్థించాడు? మన ఆధ్యాత్మిక యుద్ధంలో మనం ఏ విషయం గురించి నమ్మకంతో ఉండవచ్చు? (2 దిన. 14:11) [డిసెం. 7, w12 8/15 8వ పేజీ, 6వ పేరా–9వ పేజీ, 1వ పేరా]
7. రాజైన యెహోషాపాతు తప్పు చేసినప్పుడు యెహోవా ఆయనతో వ్యవహరించిన విధానాన్ని బట్టి దేవుని ప్రేమ గురించి మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు? దీనిబట్టి మనం ఇతరులను ఎలా చూడాలి? (2 దిన. 19:3) [డిసెం. 14, w03 7/1 17వ పేజీ, 13వ పేరా; cl 244వ పేజీ, 12వ పేరా]
8. నేడు మనం “యుద్ధపంక్తులు తీర్చి” ఎందుకు నిలబడాలి? ఎలా నిలబడాలి? (2 దిన. 20:17) [డిసెం. 21, w05 12/1 21వ పేజీ, 2వ పేరా; w03 6/1 21వ పేజీ, 15-16 పేరాలు]
9. 2 దినవృత్తాంతములు 21:20లో యెహోరాము మరణం గురించిన మాటలను బట్టి మనం ఏ ముఖ్యమైన విషయం నేర్చుకోవచ్చు? [డిసెం. 21, w98 11/15 32వ పేజీ, 4వ పేరా]
10. 2 దినవృత్తాంతములు 26:5 ప్రకారం యౌవనుడైన ఉజ్జియాపై ఎవరు మంచి ప్రభావం చూపించారు? సంఘంలో పరిణతి చెందిన క్రైస్తవుల నుండి యౌవనులు ఎలా ప్రయోజనం పొందవచ్చు? [డిసెం. 28, w07 12/15 10వ పేజీ, 2, 4 పేరాలు]