కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lmd పాఠం 12
  • నిర్మొహమాటంగా మాట్లాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిర్మొహమాటంగా మాట్లాడండి
  • ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఏం చేశాడు?
  • యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • యేసులా ఉందాం
  • మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
lmd పాఠం 12

శిష్యుల్ని చేసేటప్పుడు

తన ముందు, తన శిష్యుల ముందు మోకరించిన ఒక వ్యక్తితో యేసు ప్రేమగా మాట్లాడుతున్నాడు.

మార్కు 10:17-22

పాఠం 12

నిర్మొహమాటంగా మాట్లాడండి

సూత్రం: “నూనె, ధూపం హృదయాన్ని సంతోషపెట్టినట్టే నిజాయితీతో ఇచ్చిన సలహా నుండి చిగురించే తియ్యని స్నేహం హృదయాన్ని సంతోషపెడుతుంది.”—సామె. 27:9.

యేసు ఏం చేశాడు?

తన ముందు, తన శిష్యుల ముందు మోకరించిన ఒక వ్యక్తితో యేసు ప్రేమగా మాట్లాడుతున్నాడు.

వీడియో: ధనవంతుడైన యువ నాయకుడికి యేసు సలహా ఇచ్చాడు

1. వీడియో చూడండి, లేదా మార్కు 10:17-22 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. ఎ. ఆ యువ నాయకుడిలో యేసు ఎలాంటి మంచి లక్షణాల్ని చూసి ఉంటాడు?

  2. బి. అతనికి సలహా ఇస్తున్నప్పుడు యేసు ప్రేమ చూపిస్తూనే, నిర్మొహమాటంగా ఎలా మాట్లాడాడు?

యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

2. మన విద్యార్థులు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలంటే వాళ్లు ఏమేం చేయాలో ప్రేమగా చెప్తూనే నిర్మొహమాటంగా కూడా మాట్లాడాలి.

యేసులా ఉందాం

3. మీ విద్యార్థి లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకునేలా సహాయం చేయండి.

  1. ఎ. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలో ప్రతీ పాఠంలో ఉన్న “ఇలా చేసి చూడండి” అనే భాగాన్ని ఉపయోగించండి.

  2. బి. మీ విద్యార్థి చిన్నచిన్న లక్ష్యాలు అలాగే పెద్ద లక్ష్యాలు చేరుకోవడానికి ఏమేం చేయాలో తెలుసుకునేలా సహాయం చేయండి.

  3. సి. మీ విద్యార్థి సాధిస్తున్న ప్రగతిని బట్టి ఆయన్ని మెచ్చుకుంటూ ఉండండి.

4. మీ విద్యార్థి ఎదుర్కొంటున్న ఆటంకాలు గుర్తించి, వాటిని అధిగమించేలా ఆయనకు సహాయం చేయండి.

  1. ఎ. ఇలా ప్రశ్నించుకోండి:

    • ‘బాప్తిస్మం వైపుగా ప్రగతి సాధించకుండా నా విద్యార్థిని ఏది ఆపుతుంది?’

    • ‘ఆయనకు నేను ఎలా సహాయం చేయగలను?’

  2. బి. మీ విద్యార్థి ఏమేం చేయాలో ప్రేమగా చెప్తూనే, నిర్మొహమాటంగా కూడా మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థించండి.

5. ప్రగతి సాధించని స్టడీలను ఆపేయండి.

  1. ఎ. మీ విద్యార్థి ప్రగతి సాధిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇలా ప్రశ్నించుకోండి:

    • ‘నా విద్యార్థి నేర్చుకున్న వాటిని పాటిస్తున్నాడా?’

    • ‘మీటింగ్స్‌కు వస్తూ, నేర్చుకున్న సత్యాల్ని ఇతరులతో పంచుకుంటున్నాడా?’

    • ‘చాలా కాలంగా స్టడీ జరుగుతున్నట్లయితే, ఆయన ఒక యెహోవాసాక్షి అవ్వడానికి ఇష్టపడుతున్నాడా?’

  2. బి. ఒకవేళ మీ బైబిలు విద్యార్థి ప్రగతి సాధించడానికి ఇష్టపడకపోతే:

    • ప్రగతి సాధించకుండా ఆయన్ని ఏది ఆపుతుందో ఆలోచించమనండి.

    • మీరు స్టడీని ఎందుకు ఆపేస్తున్నారో దయగా వివరించండి.

    • మళ్లీ స్టడీ మొదలుపెట్టాలంటే ఆయన ఏమేం చేయాలో చెప్పండి.

ఇవి కూడా చూడండి

కీర్త. 141:5; సామె. 25:12; 27:6; 1 కొరిం. 9:26; కొలొ. 4:5, 6

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి