అక్టోబరు 26తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 26తో మొదలయ్యే వారం
పాట 39, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 48వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 12-15 (8 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: వేరుపారినవారై విశ్వాసమందు స్థిరంగా ఉండండి.—కొలొ. 2:6, 7.
10 నిమి:నవంబరు నెలలో ఏమి అందించాలి? చర్చ. కరపత్రాలు, మంచివార్త బ్రోషురు లేదా బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చేలా అందరిని ప్రోత్సహించండి. ఏప్రిల్ 2014, మన రాజ్య పరిచర్యలో “సరికొత్త రూపంతో కొత్త కరపత్రాలు!” అనే ఆర్టికల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పండి. మీ ప్రాంతానికి సరిపోయే ఒక ప్రదర్శన చేయించండి.
20 నిమి:“దేవుని వాక్యానికి మీ జీవితంపై పని చేసే శక్తి ఉందా?” ప్రసంగం. ఉపోద్ఘాత మాటలు పూర్తయ్యాక, jw.org వెబ్సైట్లో ఉన్న “మన నిరీక్షణను బలపర్చే వాస్తవగాథ” అనే నాటకరూపంలో సాగే బైబిలు పఠనం ప్లే చేయండి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు మనం మన జీవితంలో ఏమేమి అన్వయించుకోవాలో అర్థమౌతుందని చెప్పండి. jw.orgలో ఉన్న నాటకరూపంలో సాగే బైబిలు పఠనాలను విని అందరిని ప్రయోజనం పొందమని చెప్పి ముగించండి.
పాట 37, ప్రార్థన