దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
అక్టోబరు 26, 2015తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
దేవున్ని ఉత్సాహంగా, పూర్ణ హృదయంతో సేవించడం ముఖ్యమని 2 రాజులు 13:18, 19 ఎలా చూపిస్తుంది? [సెప్టెం. 7, w10 4/15 26వ పేజీ, 11వ పేరా]
యోనా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలును ఎవరు పరిపాలిస్తున్నారు? 2 రాజులు 14:23-25లో ఉన్న దానిని బట్టి యోనా పరిచర్యను మనం ఎందుకు మెచ్చుకోవచ్చు? [సెప్టెం. 7, w09 4/1 28వ పేజీ, 4వ పేరా]
యెషయా ద్వారా యెహోవా చెప్పిన మాటలపై నమ్మకం లేదని ఆహాజు ఎలా చూపించాడు? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? (2 రాజు. 16:7) [సెప్టెం. 14, w13 11/15 17వ పేజీ, 5వ పేరా]
నేడు దేవున్ని వ్యతిరేకిస్తున్నవాళ్లు, రబ్షాకే ఉపయోగించిన ఎలాంటి పన్నాగాన్ని ఉపయోగిస్తున్నారు? వాళ్లు చెప్పే తప్పుడు కారణాలను నమ్మకూడదంటే మనకు ఏ లక్షణం అవసరం? (2 రాజు. 18:22, 25) [సెప్టెం. 14, w10 7/15 13వ పేజీ, 3-4 పేరాలు]
యోషీయాలా వినయం చూపిస్తే మనం కూడా బైబిలు చదవడం, ధ్యానించడం నుండి మరింత ప్రయోజనం ఎలా పొందుతాం? (2 రాజు. 22:19, 20) [సెప్టెం. 21, w00 3/1 30వ పేజీ, 2వ పేరా]
2 రాజులు 24:3, 4 నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [సెప్టెం. 28, w05 8/1 12వ పేజీ, 1వ పేరా]
యబ్బేజు యెహోవాను ఏ మూడు విన్నపాలు అడిగాడు. ప్రార్థన విషయంలో మనకు అది ఏమి నేర్పిస్తుంది? (1 దిన. 4:9, 10) [అక్టో. 5, w11 4/1 23వ పేజీ]
1 దినవృత్తాంతములు 5:18-22లో వివరించిన యుద్ధ ఫలితం, ఆధ్యాత్మిక యుద్ధాన్ని ధైర్యంగా చేసేలా మనల్ని ఎలా బలపరుస్తుంది? [అక్టో. 12, w05 10/1 9వ పేజీ, 8వ పేరా]
రక్తం యొక్క పవిత్రత గురించిన యెహోవా సూత్రాన్ని దావీదు ఎలా అర్థంచేసుకోగలిగాడు, గౌరవించాడు? దాన్నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (1 దిన. 11:17-19) [అక్టో. 19, w12 11/15 6-7 పేజీలు, 12-14 పేరాలు]
నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు దావీదు ఏ విషయాన్ని అశ్రద్ధ చేశాడు, దాని నుండి ఏ ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు? (1 దిన. 15:13) [అక్టో. 26, w03 5/1 10-11 పేజీలు, 11-13 పేరాలు]