ఆగస్టు 17తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 17తో మొదలయ్యే వారం
పాట 9, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 37వ కథ (30 నిమి.)
దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 1-4 (8 నిమి.)
నం. 1: 2 రాజులు 1:11-18 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దీనా—అంశం: చెడు స్నేహాలు విషాదానికి దారితీస్తాయి—ఆది. 34:1-31 (5 నిమి.)
నం. 3: దేవునికి దగ్గరవ్వాలంటే మనమేమి చేయాలి?—igw 28వ పేజీ 5వ పేరా–29వ పేజీ 3వ పేరా (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.
15 నిమి: కుటుంబమంతా కలిసి సంఘ కూటాలకు వెళ్లే అలవాటు మీకుందా? హెబ్రీయులు 10:24, 25 ఆధారంగా ఇచ్చే ప్రసంగం. పిల్లలున్న కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయండి. కూటాలకు వెళ్లడం చాలా ముఖ్యమని కుటుంబ పెద్ద ఎలా చూపిస్తాడు? కుటుంబమంతా కలిసి కూటాలకు క్రమంగా రావడానికి ఇంట్లో ప్రతీ ఒక్కరు ఏమి చేస్తున్నారు? వ్యాఖ్యానాలు చెప్పడానికి ఎప్పుడు సిద్ధపడతారు? కూటాలకు రావడానికి ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు? ప్రతీ కూటానికి వచ్చి, అందులో పాల్గొనమని అందర్నీ ప్రోత్సహిస్తూ ముగించండి.
15 నిమి: సమయాన్ని ఎందుకు పాటించాలి? కావలికోట ఆగస్టు 15, 2010, 25-28 పేజీల ఆధారంగా చర్చ. “సమయాన్ని పాటించాలంటే మనం ఏమి చేయాలి?” అనే ఉపశీర్షిక కింద ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తున్నప్పుడు, సమయాన్ని పాటించడానికి వాళ్లకు ఏమి సహాయం చేసిందో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 44, ప్రార్థన