పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కొత్తవాళ్లకు శిక్షణనివ్వడం
ఎందుకు ప్రాముఖ్యం? కొత్తగా శిష్యులైన వాళ్లు యేసు ఆజ్ఞాపించిన “వాటినన్నిటిని” చేయాలి. అందులో ఇతరులకు సత్యాన్ని బోధించే పని కూడా ఉంది. (మత్త. 28:19, 20) చాలామంది కొత్తవాళ్లు ఇప్పటికే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పాల్గొనడానికి అర్హులై ఉంటారు. అలాగే తమ కుటుంబ సభ్యులకు స్నేహితులకు సాక్ష్యం ఇచ్చి ఉంటారు. అయితే, నేర్చుకుంటున్న వాటి మీద నమ్మకం పెరిగేకొద్దీ, ప్రజలందరూ సువార్త వినాలని యెహోవా కోరుకుంటున్నాడని తెలుసుకునేకొద్దీ, వాళ్లు కూడా పరిచర్యలో పాల్గొనడానికి ఇష్టపడుతుండవచ్చు. (రోమా. 10:13, 14) బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులైన కొత్తవాళ్లు ధైర్యంగా ప్రకటిస్తూ, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే వాళ్లకు మంచి శిక్షణ అవసరం.—లూకా 6:40.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
మీ బైబిలు విద్యార్థితో కలిసి ఇంటింటి పరిచర్య చేయండి. వాళ్లను మీతోపాటు పునర్దర్శనానికి లేదా బైబిలు అధ్యయనానికి తీసుకెళ్లండి. మీకు బైబిలు విద్యార్థి లేకపోతే అంతగా అనుభవంలేని ప్రచారకున్ని తీసుకెళ్లండి.