ఆగస్టు 10తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 10తో మొదలయ్యే వారం
పాట 13, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 36వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 21-22 (8 నిమి.)
నం. 1: 1 రాజులు 22:13-23 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవునికి మీరు ఎలా దగ్గరవ్వవచ్చు?—igw 28వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
నం. 3: దెలీలా—అంశం: డబ్బు మీద ప్రేమ నమ్మకద్రోహానికి నడిపించగలదు—న్యాయా. 16:1-21 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”—యెహో. 24:15.
10 నిమి: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.” ఈ నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. ద్వితీయోపదేశకాండము 6:6, 7; యెహోషువ 24:15; సామెతలు 22:6 చదివి, వాటిని ఎలా పాటించవచ్చో చెప్పండి. భర్తలు, తండ్రులు ఆధ్యాత్మికంగా ముందుండి నడిపించాలని నొక్కిచెప్పండి. కుటుంబాలకు సహాయం చేయడానికి సంస్థ అందించిన వేర్వేరు ప్రచురణల గురించి ప్రత్యేకంగా చెప్పండి. ఈ నెల సేవాకూటంలోని కొన్ని అంశాలను చెప్పి, ఈ నెల ముఖ్యాంశానికి వాటికి ఎలాంటి సంబంధముందో చెప్పండి.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కొత్తవాళ్లకు శిక్షణనివ్వడం.” చర్చ. పిల్లలు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించేలా సహాయం చేయడానికి తల్లిదండ్రులు ఆర్టికల్లో ఉన్న సూత్రాలను ఎలా పాటించవచ్చో ప్రేక్షకులను అడగండి. ఇంటివాళ్లతో మాట్లాడడానికి ఒక తండ్రి తన కొడుకు లేదా కూతురుతో కలిసి ప్రాక్టీసు చేస్తున్నట్లు ప్రదర్శన చేయించండి.
పాట 45, ప్రార్థన