జూన్ 15తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 15తో మొదలయ్యే వారం
పాట 51, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 26వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 22-24 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 22:21-32 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: కయీను—అంశం: సలహా ఇచ్చినప్పుడు మనం స్పందించే తీరు, మనమెలాంటి వాళ్లమో తెలియజేస్తుంది—ఆది 4:1-15; గల 5:19, 20; హెబ్రీ 11:4; యాకో 1:14, 15 (5 నిమి.)
నం. 3: ప్రేమ, విధేయత చూపిస్తే సంతోషంగా ఉంటాం—igw 22వ పేజీ, 4-6 పేరాలు (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము.”—ద్వితీ. 32:7.
12 నిమి: బైబిల్లో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఇంటర్వ్యూ, ప్రసంగం. సంఘంలోని ఇద్దరుముగ్గురు చిన్న పిల్లలను ఇంటర్వ్యూ చేసి మొదలుపెట్టండి. ఈ ప్రశ్నలు అడగండి: బైబిల్లో ఎక్కువగా ఎవరు ఇష్టం? వాళ్లు ఏమేం చేశారు? వాళ్లలా ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? తర్వాత గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి, నా బైబిలు కథల పుస్తకము, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లాంటి పుస్తకాల నుండి పిల్లలు ఎలా ప్రయోజనం పొందవచ్చో వివరిస్తూ ప్రసంగం ఇవ్వండి. “పూర్వదినములను” గురించి పిల్లలకు నేర్పించడానికి ఈ పుస్తకాలను ఉపయోగించమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి.—ద్వితీ. 32:7.
18 నిమి: “అనుభవం ఉన్న ప్రచారకులనుండి నేర్చుకోండి.” చర్చ. రెండవ పేరా పరిశీలించేటప్పుడు, అనుభవం ఉన్న ప్రచారకునితో పరిచర్య చేసి ఎలా ప్రయోజనం పొందారో ప్రేక్షకులను చెప్పమనండి.
పాట 4, ప్రార్థన