పరిచర్యలో నైపుణ్యాలు మెరుగు పర్చుకుందాం—మంచివార్త బ్రోషుర్తో బైబిలు అధ్యయనం మొదలుపెట్టండి
ఎందుకు ప్రాముఖ్యం? శిష్యులను చేయాలంటే, మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. (మత్త. 28:19, 20) మన దగ్గరున్న ప్రచురణలను ఉపయోగించి మనందరం సత్యాన్ని చక్కగా బోధించవచ్చు. ఇతరులకు సత్యం గురించి నేర్పించడానికే దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురును తయారు చేశారు. మనం ఇంటివాళ్లను మొదటిసారి కలుసుకున్నప్పుడు ఈ బ్రోషురు సహాయంతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టవచ్చు.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
బైబిలు అధ్యయనం చేయాలనే కోరిక మీలో కలగాలని ప్రార్థించండి. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి, సత్యాన్ని సమర్థవంతంగా నేర్పించడానికి సహాయం చేయమని యెహోవాను బ్రతిమాలండి.—ఫిలి. 2:13.
కుటుంబ ఆరాధనలో లేదా వ్యక్తిగత అధ్యయనంలో ఈ బ్రోషురును ఎలా ఇవ్వాలో బాగా ప్రాక్టీస్ చేయండి. దానివల్ల, మీరు మంచి ఆత్మవిశ్వాసంతో మాట్లాడి, బైబిలు అధ్యయనం మొదలుపెట్టగలరు.
ఒక జాగ్రత్త: వేరేవాళ్లు మిమ్మల్ని గమనిస్తున్నారు అని మీకు అనిపిస్తే, గుమ్మం దగ్గర ఎక్కువసేపు మాట్లాడకపోవడం మంచింది.