నవంబరు 10తో మొదలయ్యే వారపు పట్టిక
నవంబరు 10తో మొదలయ్యే వారం
పాట 17, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
23వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 19-22 (10 నిమి.)
నం. 1: ద్వితీయోపదేశకాండము 22:20-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుణ్ణి తప్ప వేరొకరిని ఆరాధించడం అంగీకృతం కాదు—td 21సి (5 నిమి.)
నం. 3: మోషే అహరోనులు ఫరోను కలవడం —my 31వ కథ (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: సేవా పర్యవేక్షకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది? ఏదైనా క్షేత్రసేవా గుంపును సందర్శించినప్పుడు, మీరు ఏమి చేయడానికి ప్రయత్నిస్తారు? మీ సందర్శనం నుండి గుంపు పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏంచేయాలి? పరిచర్యకు సంబంధించిన ఏదైనా విషయంలో మద్దతు కోసం ఒక ప్రచారకుడు మీ దగ్గరకు వస్తే, మీరెలా సహాయం చేస్తారు? పరిచర్యలో వ్యతిరేకత రాకుండా చూసుకునేలా ప్రచారకులకు ఎలా తర్ఫీదు ఇస్తారు?
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఇంటివాళ్ల మీద శ్రద్ధ చూపించండి.” చర్చ. ఆర్టికల్‌ను చర్చించిన తర్వాత రెండు భాగాల ప్రదర్శన చేయించండి. మొదట, ప్రచారకుడు వ్యక్తి మీద శ్రద్ధ చూపించకుండానే ఆ నెల ప్రచురణను అందిస్తున్నట్లు ప్రదర్శింపజేయండి. తర్వాత, అదే సందర్భంలో ప్రచారకుడు శ్రద్ధ చూపిస్తున్నట్లు చూపించండి.
పాట 25, ప్రార్థన