అక్టోబరు 27తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 27తో మొదలయ్యే వారం
పాట 12, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 21వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 11-13 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘అత్యవసర భావంతో వాక్యాన్ని ప్రకటించండి.’—2 తిమో. 4:2, Nw.
15 నిమి: “ప్రకటించే విషయంలో అత్యవసర భావాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?” చర్చ. ఒక ప్రచారకుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ కరపత్రాన్ని గానీ ఇస్తున్నట్లు ప్రదర్శన చేయించండి.
15 నిమి: అత్యవసర భావంతో ప్రకటించడానికి బాగా సిద్ధపడండి. కావలికోట ఆగస్టు 15, 2014 సంచిక 14-15 పేజీల్లోని 14-20 పేరాల ఆధారంగా చర్చ. మీ క్షేత్రంలోని ప్రజలు ఎక్కువగా వేటి గురించి ఆలోచిస్తున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. వాటి గురించి పరిచర్యలో మనం ఎలా మాట్లాడవచ్చు? ఇద్దరు పయినీర్లు లేదా భార్యాభర్తలు అందులో సమాచారాన్ని ఉపయోగించి క్షేత్రంలోని ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడడానికి ఎలా సిద్ధపడుతున్నారో ప్రదర్శింపజేయండి. ఏ ప్రచురణను ఉపయోగించాలో వాళ్లే నిర్ణయించుకోవచ్చు.
పాట 33, ప్రార్థన