దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2014 అక్టోబరు 27తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
సంఖ్యాకాండము 21:5లో ఉన్నట్లు, ఇశ్రాయేలీయులు దేవునికి, మోషేకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు? దానిలో మనకు ఎలాంటి హెచ్చరిక ఉంది? [సెప్టెం. 1, w99 8/15 26-27 పేజీలు]
యెహోవా కోపం బిలాముపై ఎందుకు రగులుకొంది? (సంఖ్యా. 22:20-22) [సెప్టెం. 8, w04 8/1 27వ పేజీ, 3వ పేరా]
ఫీనెహాసు మనస్తత్వం గురించి సంఖ్యాకాండము 25:11 మనకు ఏమి చెబుతుంది? మనం ఆయన్నెలా అనుకరించవచ్చు? [సెప్టెం. 8, w04 8/1 27వ పేజీ, 5వ పేరా]
వినయం చూపించే విషయంలో, ఏయే విధాలుగా మోషే మనకు చక్కని ఆదర్శాన్ని ఉంచాడు? (సంఖ్యా. 27:5, 15-18) [సెప్టెం. 15, w13 4/1 5వ పేజీ]
వ్యతిరేకత వచ్చినా అపరిపూర్ణ మానవులు దేవుని మార్గాల్లో నడవగలరని యెహోషువ, కాలేబుల ఉదాహరణ ఎలా గట్టిగా నిరూపిస్తుంది? (సంఖ్యా. 32:12) [సెప్టెం. 22, w93 11/15 14వ పేజీ, 13వ పేరా]
సెలోపెహాదు కుమార్తెలు చూపించిన విధేయత, వివాహం విషయంలో ఒక అవివాహిత క్రైస్తవుని మనోవైఖరిని ఎలా ప్రభావితం చేయవచ్చు? (సంఖ్యా. 36:10-12) [సెప్టెం. 29, w08 2/15 4వ పేజీ, 10వ పేరా]
ఫిర్యాదు చేసే స్వభావం వల్ల, ప్రతికూలంగా మాట్లాడినందువల్ల ఇశ్రాయేలీయులు ఎలాంటి పర్యవసానాన్ని ఎదుర్కొన్నారు? దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ద్వితీ. 1:26-28, 34, 35) [అక్టో. 6, w13 8/15 11వ పేజీ, 7వ పేరా]
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో యెహోవా ఆశీర్వాదాలతో విలసిల్లాలంటే, ఏ రెండు బాధ్యతల్ని నిర్వర్తించాలి? (ద్వితీ. 4:9) [అక్టో. 13, w06 6/1 29వ పేజీ, 15వ పేరా]
అరణ్య ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు ఏ విధంగా ఇశ్రాయేలీయుల బట్టలు పాతగిలలేదు, వాళ్ల కాళ్లు వాయలేదు? (ద్వితీ. 8:3, 4) [అక్టో. 20, w04 9/15 26వ పేజీ, 1వ పేరా]
యెహోవాను “హత్తుకొని యుండవలెను” అని ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటను మనమెలా పాటించవచ్చు? (ద్వితీ. 13:4, 6-9) [అక్టో. 27, w02 10/15 16వ పేజీ, 14వ పేరా]