ముఖ్యాంశాలను ప్రత్యేకంగా చెబుతూ బోధనాకళను మెరుగుపర్చుకుందాం
1 ‘మీరు బోధకులుగా ఉండాలి’ అని పౌలు హెబ్రీయులకు రాశాడు. (హెబ్రీ. 5:12) యేసు అప్పగించిన శిష్యుల్ని చేసే పని చివరికి చేరుకుంటున్న ఈ రోజుల్లో కూడా మనం అలాగే ఉండాలి. మెరుగైన బోధకులుగా ఉండాలంటే మనం చదివి బోధించే వాటి సారాంశాన్ని గ్రహించగలగాలి. అది అధ్యయనం చేస్తున్న పూర్తి పుస్తకం, అధ్యాయం లేదా పేరా ఏదైనా సరే మనం వాటి సారాంశాన్ని గ్రహించాలి.
2 పుస్తకం పేరు ఎప్పుడూ ముఖ్యాంశాన్ని తెలియజేస్తుంది. ఒక పుస్తకం నుండి బోధిస్తున్నప్పుడు ప్రతీ అధ్యాయం పేరుకు, పుస్తకం పేరుకు మధ్య సంబంధాన్ని మనం గుర్తించగలగాలి. ఆ సంబంధాన్ని గుర్తించగలిగేలా విద్యార్థికి సహాయం చేయండి. సాధారణంగా ఒక అధ్యాయంలో చర్చించే విషయం పుస్తకం ముఖ్యాంశంలోని ఒక అంశాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, “దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం,” “మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?” అధ్యాయాలు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకోవడానికి విద్యార్థికి సహాయం చేస్తాయి.
3 ఆర్టికల్ లేదా అధ్యాయంలో వచ్చే ముఖ్యాంశాలను గుర్తించడానికి ఉపశీర్షికలు సహాయం చేస్తాయి. ప్రతీ పేరాకు ఆ అధ్యాయం శీర్షికకు ఏదోక విధంగా సంబంధం ఉంటుంది. అధ్యాయం శీర్షికతో బాగా దగ్గరగా ఉండే విషయం పేరాలో ఎక్కడ ఉందో గుర్తించడానికి ప్రయత్నించండి. ఆ విషయాన్నే మీరు విద్యార్థికి ముఖ్యాంశంగా ప్రత్యేకంగా చెప్పాలి.
4 సాధారణంగా, ముద్రిత ప్రశ్నలు ఉన్న ప్రచురణ నుండి బోధిస్తున్నప్పుడు ప్రశ్నకు జవాబు చిన్న వాక్యంలోనో, కొన్నిసార్లు ఒకే పదంలోనో ఉంటుంది. ఆ పదం లేదా వాక్యం కింద మాత్రమే గీత గీసుకోవడం విద్యార్థికి నేర్పించండి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పేరాను మళ్లీ చదవకుండా విద్యార్థి జవాబును త్వరగా కనిపెట్టగలుగుతాడు. గీత గీసుకున్న పెద్దపెద్ద వాక్యాలను చదివే బదులు, జవాబును సొంత మాటల్లో చెప్పమని విద్యార్థిని ప్రోత్సహించండి. గీత గీసుకున్న ఆ కొన్ని పదాలను చూసి, ముఖ్యాంశాన్ని వెంటనే గ్రహించగలుగుతాడు.
5 పేరాలోని లేదా వచనంలోని ముఖ్యాంశాలను గుర్తించడానికి ఏటవాలు లేదా ఏటవాలు ముద్దక్షరాలు బోధకునికి, విద్యార్థికి ఎంతగానో సహాయపడతాయి. అలా ముఖ్యాంశాల్ని గుర్తించడానికే వాటిని ప్రత్యేకంగా ముద్రించారని విద్యార్థికి చెప్పండి. అప్పుడు విద్యార్థి ముఖ్యాంశాల్ని గ్రహించి ఇతరులకు తన నమ్మకాలను సులువుగా వివరించగలుగుతాడు.
6 కావలికోట అధ్యయనమైనా, సంఘ బైబిలు అధ్యయనమైనా, గృహ బైబిలు అధ్యయనమైనా, పిల్లలకు నేర్పించడమైనా ముఖ్యాంశాల్ని గ్రహించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ‘శిష్యులను చేయాలని, వాళ్లకు బోధించాలని’ యేసు మనకు చెప్పాడు. (మత్త. 28:19, 20) ఆ ఆజ్ఞను పాటించడానికి ముఖ్యాంశాలను ప్రత్యేకంగా చెప్పడం మనకు సహాయం చేస్తుంది.