సెప్టెంబరు 1తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 1తో మొదలయ్యే వారం
పాట 37, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 13వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 17-21 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 17:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఆధునిక కాలంలోని విశ్వాస స్వస్థతలకు దేవుని అంగీకారమున్న రుజువు లేదు—td 45సి (5 నిమి.)
నం. 3: యోబు దేవునికి నమ్మకంగా ఉండడం—my 26వ కథ (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: ఆగస్టులో పత్రిక అందించండి. చర్చ. “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రాజ్యం గురించి ధైర్యంగా ప్రకటిద్దాం” అనే ఆర్టికల్లోని అంశాలను పాటించడంవల్ల ఎలా ప్రయోజనం పొందారో ప్రచారకులను చెప్పమనండి. రాజ్యం గురించి ప్రకటించే విషయంలో తమకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో ప్రేక్షకులను అడగండి. వాటిని ఎలా అధిగమించారో చెప్పమనండి.
15 నిమి: ప్రత్యేక ప్రచార కార్యక్రమ నివేదిక. సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉండడం ఎంత అవసరమో చూపించే, ఈ నెల మన రాజ్య పరిచర్య ఆర్టికల్స్లోని ముఖ్యాంశాలను క్లుప్తంగా చెప్పండి. ఈ నిర్దేశానికి సంఘం ఎలా స్పందించింది? ప్రచార కార్యక్రమంలో ఏమి సాధించారో కొన్ని ముఖ్యాంశాలు చెప్పండి.
పాట 45, ప్రార్థన