దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2014 ఆగస్టు 25తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
తప్పొప్పుల విషయంలో వక్ర ఆలోచన ఏర్పర్చుకోకుండా లేవీయకాండము 18:3 మనకెలా సహాయం చేస్తుంది? (ఎఫె. 4:17-19) [జూలై 7, w02 2/1 29వ పేజీ, 4వ పేరా]
లేవీయకాండము 19:2లోని ఆజ్ఞ మనకేమి బోధిస్తుంది? దాన్ని పాటించడానికి మనమెందుకు తీవ్రంగా కృషిచేయాలి? [జూలై 7, w10 1/1 30వ పేజీ, 5వ పేరా]
పరిగె ఏరుకునే ఏర్పాటుకు సంబంధించిన ప్రాచీనకాల నియమం మనకేమి బోధిస్తుంది? (లేవీ. 19:9, 10) [జూలై 7, w06 6/15 22-23 పేజీలు, 13వ పేరా]
“కంటికి కన్ను” అనే నియమం, ప్రతీకార స్వభావాన్ని ప్రోత్సహించలేదని ఎందుకు చెప్పవచ్చు? (లేవీ. 24:19, 20) [జూలై 14, w10 1/1 12వ పేజీ, 3-4 పేరాలు]
ఇశ్రాయేలీయులు ఎలాంటి సందర్భాల్లో వడ్డీ తీసుకోవడం తప్పు? అలా తీసుకోవడం ఎప్పుడు తప్పు కాదు? (లేవీ. 25:35-37) [జూలై 21, w04 5/15 24వ పేజీ, 3వ పేరా]
అరణ్యంలో మూడు గోత్రాల వాళ్లు దిగాల్సిన ‘ధ్వజములు’ ఏమిటి? (సంఖ్యా. 2:1, 2) [జూలై 28, w04 8/1 24వ పేజీ, 5వ పేరా]
లేవీయులు చేయాల్సిన తప్పనిసరి సేవ గురించి సంఖ్యాకాండము 8:25, 26లో ఉన్నదాని నుండి, వయసు పైబడిన వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకునే విషయంలో మనమేమి నేర్చుకోవచ్చు? [ఆగ. 11, w04 8/1 25వ పేజీ, 1వ పేరా]
ఐగుప్తు నుండి అద్భుతరీతిలో విడుదలయ్యాక ఇశ్రాయేలీయుల్లో ఎందుకు సణిగే స్వభావం మొదలైంది? దాన్నుండి మనం ముఖ్యమైన ఏ పాఠం నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 11:4-6) [ఆగ. 18, w95 3/1 15-16 పేజీలు, 10వ పేరా]
ఎల్దాదు, మేదాదు ప్రవచించడం మొదలుపెట్టారని విన్నప్పుడు మోషే స్పందించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సంఖ్యా. 11:27-29) [ఆగ. 18, w04 8/1 26వ పేజీ, 4వ పేరా]
ఇశ్రాయేలీయులు “తమ బట్టల అంచులకు కుచ్చులు” చేసుకోవాలనే ఆజ్ఞలో ఏ విలువైన సూత్రం ఉంది? (సంఖ్యా. 15:37-39) [ఆగ. 25, w04 8/1 26వ పేజీ, 7వ పేరా]