కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/14 పేజీలు 3-4
  • ప్రత్యేక ఆహ్వానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రత్యేక ఆహ్వానం
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహంగా ఆహ్వానించండి
    మన రాజ్య పరిచర్య—2015
  • ప్రత్యేక ప్రచార కార్యక్రమం మార్చి 1న మొదలౌతుంది
    మన రాజ్య పరిచర్య—2013
  • ప్రచార కార్యక్రమం మార్చి 22న మొదలౌతుంది
    మన రాజ్య పరిచర్య—2014
  • ఏప్రిల్‌ 2 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఇవ్వడం మొదలుపెడతాం
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2014
km 7/14 పేజీలు 3-4

ప్రత్యేక ఆహ్వానం

1. 2014 సమావేశ ఆహ్వానపత్రాలు ఇచ్చే ప్రచార కార్యక్రమం ఎప్పుడు మొదలౌతుంది?

1 మీరు ఎంతో ప్రయాసపడి మీ స్నేహితుల కోసం లేదా కుటుంబం కోసం ఖరీదైన విందు ఏర్పాటు చేస్తుంటే, వాళ్లను ఆహ్వానించేటప్పుడు మీలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది. అలాగే 2014 ప్రాదేశిక, అంతర్జాతీయ సమావేశాల్లో అందించబోయే ఆధ్యాత్మిక విందును సిద్ధం చేయడానికి కూడా ఎంతో కృషి జరిగింది. సమావేశానికి మూడు వారాల ముందునుండి ప్రజలను ఆహ్వానించే గొప్ప అవకాశం మనకు ఉంది. దానిలో ఉత్సాహంగా పాల్గొనడానికి మనకేది సహాయం చేస్తుంది?

2. ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనాలనే ప్రేరణను మనం ఎలా పొందుతాం?

2 సమావేశాల ద్వారా యెహోవా అందించే ఆధ్యాత్మిక విందు నుండి మనం ఎంతగా ప్రయోజనం పొందుతున్నామో ఆలోచించినప్పుడు, ఆహ్వానపత్రాలు అందించే ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనాలనే ప్రేరణ పొందుతాం. (యెష. 65:13, 14) అలాగే, ప్రతీ సంవత్సరం మనం చేసే ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తుంచుకోండి. మనం ఆహ్వానించే వాళ్లలో కొందరు సమావేశానికి వస్తారు. ఎంతమంది వస్తారనేది పక్కనపెడితే, ప్రచార కార్యక్రమం కోసం మనం నిజాయితీగా చేసే ప్రయత్నాలు యెహోవాకు స్తుతిని తీసుకొస్తాయి, ఆయన ఉదారతకు అద్దం పడతాయి.—కీర్త. 145:3, 7; ప్రక. 22:17.

3. ఆహ్వానపత్రాలను ఎలా పంచిపెడతాం?

3 క్షేత్రంలో, తాళాలు వేసివున్న ఇళ్లలో ఆహ్వానపత్రాలను పెట్టాలా వద్దా? బహిరంగ సాక్ష్యంలో వాటిని ఇవ్వాలా లేదా? వంటివాటిని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానపత్రాలను ఎక్కువమందికి ఎలా పంచిపెట్టాలో పెద్దల సభ నిర్ణయిస్తుంది. వారాంతాల్లో సముచితమైనప్పుడు ఆహ్వానపత్రాలతో పాటు పత్రికలను కూడా అందించాలి. ఒకవేళ ప్రచార కార్యక్రమం నెలలోని మొదటి శనివారం జరుగుతుంటే, బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం కన్నా ఆహ్వానపత్రాలు అందించడం మీదే దృష్టిపెట్టండి. ప్రచార కార్యక్రమం ముగిసినప్పుడు, ఉత్సాహంగా దానిలో పాల్గొన్నందుకు, యెహోవా అందించే ఆధ్యాత్మిక విందుకు సాధ్యమైనంత ఎక్కువమందిని ఆహ్వానించినందుకు ఎంతో ఆనందం పొందుతాం.

ఎలా ఇవ్వాలి?

వాళ్లను పలకరించి ఇలా చెప్పండి: “ఒక ముఖ్యమైన సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆహ్వానిస్తున్నాం. తేదీ, సమయం, స్థలం వివరాలు ఇందులో ఉన్నాయి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి