కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/14 పేజీలు 2-3
  • ప్రజలందరినీ సమావేశపర్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలందరినీ సమావేశపర్చు
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఇలాంటి మరితర సమాచారం
  • వినండి, నేర్చుకోండి
    మన రాజ్య పరిచర్య—2013
  • ఆధ్యాత్మిక విందు ఆరగించి, ఆనందించే సందర్భం
    మన రాజ్య పరిచర్య—2008
  • 1990వ సంవత్సరపు “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశమునకు రండి
    మన రాజ్య పరిచర్య—1990
  • “దైవిక జీవిత మార్గము” 1998 యెహోవాసాక్షుల జిల్లాసమావేశాలు
    మన రాజ్య పరిచర్య—1998
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2014
km 7/14 పేజీలు 2-3

“ప్రజలందరినీ సమావేశపర్చు”

1. ఐగుప్తును విడిచి వచ్చిన కొంతకాలానికే ఇశ్రాయేలీయులు సమకూడిన ముఖ్యమైన సమావేశానికీ నేటి ప్రాదేశిక, అంతర్జాతీయ సమావేశాలకూ ఎలాంటి పోలికలు ఉన్నాయి?

1 ఐగుప్తును విడిచి వచ్చిన కొంతకాలానికే యెహోవా మోషేకు ఒక పని చెప్పాడు. ప్రజలు తనకు భయపడేలా, తన మార్గాల గురించి తమ పిల్లలకు నేర్పించేలా తన మాటలు వినడానికి సీనాయి కొండ దగ్గర “ప్రజలందరినీ సమావేశపర్చు” అని అన్నాడు. (ద్వితీ. 4:10-13, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అది విశ్వాసాన్ని బలపర్చే, ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భం! రానున్న నెలల్లో యెహోవా ప్రజలు ఆయన మాటలు వినడానికి ప్రాదేశిక, అంతర్జాతీయ సమావేశాలకు హాజరౌతారు. వాటినుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయాలి?

2. మనం సమావేశాలకు ‘సిద్ధంగా ఉండాలంటే’ ఏమి చేయాలి?

2 ‘సిద్ధంగా ఉండండి’: సీనాయి కొండ దగ్గర జరిగే ఆ చారిత్రక సమావేశానికి ‘సిద్ధంగా ఉండమని’ యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (నిర్గ. 19:10, 11) అదేవిధంగా, రానున్న సమావేశంలో నియామకాలు ఉన్నవాళ్లే కాకుండా హాజరయ్యే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా సిద్ధపడాలి. అంటే, ఉద్యోగం చేసేవాళ్లు ముందే సెలవు తీసుకోవాలి. బహుశా మీరు కూడా నెహెమ్యా ఉన్న పరిస్థితిలోనే ఉండివుంటారు. నెహెమ్యా అర్తహషస్త రాజుకు ద్రాక్షారసం అందించే పని చేసేవాడు. యెరూషలేము గోడలు మళ్లీ కట్టే పనిలో సహాయం చేయడం కోసం తన ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నాడు. దానికి రాజు ఒప్పుకోకపోవచ్చని ఆయనకు తెలుసు. నెహెమ్యా ప్రార్థన చేసుకుని ధైర్యంగా, మర్యాదపూర్వకంగా దాని గురించి రాజుకు చెప్పాడు. రాజు ఒప్పుకున్నాడు, ఆ నిర్మాణ పనికి సహాయం కూడా చేశాడు. (నెహె. 2:1-9) మీరు సెలవు కోసం యజమాని దగ్గర అనుమతి తీసుకున్నారా? ప్రయాణం కోసం, వసతి కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నారా? ఎవరికైనా సహాయం అవసరమైతే పెద్దలు సంతోషంగా మద్దతిస్తారు. ప్రతీరోజు సమావేశానికి త్వరగా వచ్చేలా చూసుకోండి, చెప్పబోయే విషయాలను ‘మరి విశేష జాగ్రత్తతో’ వినేందుకు సిద్ధంగా ఉండండి.—హెబ్రీ. 2:1.

3. సమావేశం కోసం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?

3 వినడానికి, నేర్చుకోవడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. (ఎజ్రా 7:10) సమావేశ కార్యక్రమ పట్టికను చాలా ముందుగానే jw.org వెబ్‌సైట్‌లో పెడతారు. అందులో ఒక్కో ప్రసంగ అంశం, దానికి ఆధారమైన ఒకట్రెండు ముఖ్య లేఖనాలు ఉంటాయి. మన సమావేశం దగ్గరపడుతుండగా ఆ సమాచారాన్ని కుటుంబ ఆరాధనలో పరిశీలించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. కొందరు ప్రచారకులు దాన్ని ప్రింట్‌ తీసుకుని సమావేశంలో నోట్సు రాసుకోవడానికి ఉపయోగించుకుంటారు.

4. సమావేశమప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా నేర్పించవచ్చు?

4 ‘మీ పిల్లలకు నేర్పండి’: యెహోవా ఇశ్రాయేలీయులను సీనాయి కొండ దగ్గర సమావేశపర్చడానికి మరో ముఖ్య కారణం ఉంది. అది, తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడానికి అవకాశాన్నిచ్చింది. (ద్వితీ. 4:10) అలాగే రానున్న సమావేశం కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడానికి ఎంతో చక్కని అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను తమతోపాటు కూర్చోబెట్టుకొని, వాళ్లు జాగ్రత్తగా వినేలా చూసుకోవాలి. ప్రతీరోజు సమావేశం ముగిశాక, అలాగే ఆ తర్వాత కుటుంబ ఆరాధనలో అందరూ కలిసి కార్యక్రమంలోని విషయాలను చర్చించుకోవచ్చు.

5. రానున్న సమావేశానికి హాజరవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

5 సీనాయి కొండ దగ్గర జరిగిన చారిత్రక సమావేశం, దేవుని ప్రజలుగా ఉండడం ఎంత గొప్ప గౌరవమో అర్థం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులకు సహాయం చేసింది. (ద్వితీ. 4:7, 8) రానున్న సమావేశం కూడా అదే చేస్తుంది. ఆ మూడు రోజులు మనం సాతాను లోకమనే భీకర అరణ్యం నుండి బయటకు వచ్చి ఆధ్యాత్మిక పరదైసులో సేదదీరతాం, ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆస్వాదిస్తాం. (యెష. 35:7-9) యెహోవా దినం సమీపిస్తుండగా, ఒకరినొకరం ప్రోత్సహించుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం!—హెబ్రీ. 10:24, 25.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి