కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/15 పేజీలు 3-4
  • ఉత్సాహంగా ఆహ్వానించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉత్సాహంగా ఆహ్వానించండి
  • మన రాజ్య పరిచర్య—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రత్యేక ఆహ్వానం
    మన రాజ్య పరిచర్య—2014
  • చక్కని ఫలితాలు తెచ్చే ప్రచార కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—2013
  • ఏప్రిల్‌ 2 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఇవ్వడం మొదలుపెడతాం
    మన రాజ్య పరిచర్య—2011
  • ప్రత్యేక ప్రచార కార్యక్రమం మార్చి 1న మొదలౌతుంది
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2015
km 7/15 పేజీలు 3-4

ఉత్సాహంగా ఆహ్వానించండి

1. సమావేశ ఆహ్వాన పత్రాలు ఎప్పటి నుండి ఇస్తాం?

1 మీరు చాలా ఖర్చుపెట్టి, కష్టపడి మీ బంధువులకు లేదా స్నేహితులకు ఒక ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారనుకోండి. వాళ్లను చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తారు కదా! అలాగే, రాబోయే సమావేశంలో మనకు అందించే ఆధ్యాత్మిక విందును తయారుచేయడానికి ఎంతో పని జరిగింది. సమావేశానికి మూడు వారాల ముందు నుండి ఆహ్వానపత్రాలు ఇచ్చే అవకాశం యెహోవా మనకిచ్చాడు. ఆహ్వానపత్రం ఉత్సాహంగా ఇచ్చేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?

2. దేని గురించి ఆలోచిస్తే మనం ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొంటాం?

2 సమావేశాల్లో సేదదీర్పునిచ్చే యెహోవా ఉపదేశాన్ని విన్నప్పుడు మనం ఎంత ప్రయోజనం పొందుతున్నామో కృతజ్ఞతతో ఆలోచిస్తే ఈ ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొంటాం. (యెష. 65:13, 14) ప్రచార కార్యక్రమం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. (“మంచి ఫలితాలు వస్తాయి” బాక్సు చూడండి.) మనం ఆహ్వానించే వాళ్లలో కొంతమంది సమావేశానికి వస్తారు, కొంతమంది రారు. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి మనం చేసే కృషి యెహోవాకు స్తుతిని తెస్తుంది, ఆయన ఉదారతను చాటిచెప్తుంది.—కీర్త. 145:3, 7; ప్రక. 22:17.

3. ఆహ్వానపత్రాల్ని మనం ఎలా ఇస్తాం?

3 ఆహ్వాన పత్రాల్ని ఎక్కువమందికి ఎలా అందించాలి? తాళంవేసున్న ఇళ్లలో ఆహ్వానపత్రాల్ని పెట్టాలా వద్దా? లేక బహిరంగ సాక్ష్యంలో వాటిని అందించాలా వద్దా? అన్నది పెద్దల సభ నిర్ణయిస్తుంది. శని, ఆదివారాల్లో వీలైతే ఆహ్వానపత్రంతో పాటు పత్రికలను కూడా ఇవ్వాలి. ఉత్సాహంగా పాల్గొన్నందుకు, మనతోపాటు చాలామంది యెహోవా ఇచ్చిన ఆధ్యాత్మిక విందుకు వచ్చినందుకు ప్రచార కార్యక్రమం ముగిశాక మనం చాలా సంతోషిస్తాం.

మీరెలా ఇస్తారు?

ఇంటివాళ్లను పలకరించాక, ఇలా చెప్పవచ్చు: “ప్రపంచమంతటా జరుగుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తేదీ, సమయం, స్థలం ఇక్కడ ఉన్నాయి.”

మంచి ఫలితాలు వస్తాయి

  • చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి సమావేశ ఆహ్వాన పత్రాలు పంచిపెడుతున్నప్పుడు ‘ఈ కష్టానికి ఫలితం ఉంటుందా? వీళ్లందరు నిజంగా సమావేశానికి వస్తారా?’ అనుకుంది. శనివారం ఉదయం సమావేశంలో తనకు కొంచెం దగ్గర్లో కూర్చున్న ఒక సిక్కు అతన్ని చూసి, ఆయన్ను పరిచయం చేసుకోవాలనుకుంది. అప్పుడు, మన ఆహ్వాన పత్రాన్ని అందుకుని అతను సమావేశానికి వచ్చాడని ఆమెకు తెలిసింది. ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు, సహోదరి వాటన్నిటికీ జవాబిచ్చింది. ఆ కార్యక్రమం, అక్కడకు వచ్చిన వాళ్ల కనబడే తీరు, ప్రవర్తన అతనికి చాలా నచ్చిందని చెప్పాడు. తర్వాత అదే రోజు, ఆమె తన దగ్గర కూర్చున్న భార్యాభర్తలతో మాట్లాడినప్పుడు వాళ్లు కూడా ఆహ్వాన పత్రాన్ని అందుకుని, బస్సులో ప్రయాణించి సమావేశానికి వచ్చారని తెలిసింది. వాళ్లకు సమావేశం చాలా నచ్చింది, ఆదివారం కూడా రావాలనుకున్నారు. సమావేశం ముందు జరిగే ప్రచార కార్యక్రమం ఎంత ముఖ్యమో అప్పుడు ఆ సహోదరి అర్థం చేసుకుంది.

  • క్రమ పయినీర్లుగా సేవచేస్తున్న ఒక జంట, ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఒక వృద్ధ దంపతుల్ని పరిచయం చేసుకుంది. ఆ దంపతులు సమావేశానికి మొదటిసారి వచ్చామని చెప్పారు. “మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు?” అని ఆ పయినీర్లు అడిగితే “మేము ఒక రోజు ఇంటికి వచ్చేసరికి, మా తలుపు దగ్గర ఆహ్వాన పత్రం ఉంది,” అని వాళ్లు చెప్పారు. వాళ్లు ఆ ఆహ్వాన పత్రాన్ని చదివి, దాని వెనకున్న కూపన్‌ కూడా నింపారు. సమావేశానికి వచ్చిన ఇతర సహోదరసహోదరీలు వాళ్లతో తమ భోజనాన్ని పంచుకున్నారు. వాళ్లు ఆ కార్యక్రమాన్ని చాలా ఆనందించి, తర్వాత రోజు కూడా రావాలనుకున్నారు. వాళ్లను కలిసి, వాళ్ల ఆసక్తిని పెంచడానికి ఏర్పాట్లు కూడా జరిగాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి