పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—తోటి ప్రచారకునికి సహాయం చేయండి
ఎందుకు ప్రాముఖ్యం? ఇద్దరిద్దరుగా పరిచర్య చేయడం ఎంత ప్రయోజనకరమో యేసు గుర్తించాడు. అందుకే తన 70 మంది శిష్యుల్ని ప్రకటనాపనికి పంపుతున్నప్పుడు వాళ్లను ఇద్దరిద్దరినిగా పంపించాడు. (లూకా 10:1) దానివల్ల, ఒక ప్రచారకునికి ఏదైనా సమస్య ఎదురైనా లేదా ఇంటివాళ్ల ప్రశ్నకు అతను జవాబివ్వలేకపోతున్నా తోటి ప్రచారకుడు అతనికి అవసరమైన సహాయం అందిస్తాడు. (ప్రసం. 4:9, 10) పైగా, తన అనుభవాన్ని పంచుకుంటూ, తోటి ప్రచారకుడు మరింత సమర్థవంతమైన సువార్తికుడయ్యేలా తోడ్పడే సలహా అప్పుడప్పుడు ఇవ్వగలుగుతాడు. (సామె. 27:17) అంతేకాదు, ఒక ఇంటినుండి మరో ఇంటికి వెళ్లేటప్పుడు ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ అతను మనల్ని బలపర్చవచ్చు.—ఫిలి. 4:8.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
తోటి ప్రచారకునితో కలిసి పరిచర్య చేసిన తర్వాత, అతను అన్న ఏ మాట, చేసిన ఏ పని మీకు సహాయపడిందో అతనికి చెప్పండి.